హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సినీ నిర్మాత సి. కళ్యాణ్‌కు బెయిల్ మంజూరు

By Pratap
|
Google Oneindia TeluguNews

C Kalyan
హైదరాబాద్: ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత సి. కళ్యాణ్‌కు శుక్రవారం హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 25 వేల రూపాయలు, ఇద్దరి పూచీకత్తుపై ఆయన బెయిల్ మంజూరు అయింది. రెండు కేసుల్లో అతను అరెస్టయిన విషయం తెలిసిందే. అతను 14 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నాడు. షాలీమర్ సంస్థకు వీడియో హక్కుల విషయంపై నమోదైన కేసుతో పాటు మరో కేసు కూడా ఆయనపై ఉంది.

కాగా, కళ్యాణ్‌ను సిఐడి పోలీసులు చెన్నైలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసున్నప్పటికీ దానిపై కోర్టు నిర్ణయం తీసుకోవడానికి ముందే పోలీసులు అరెస్టు చేశారు. మరో చిత్ర నిర్మాత శింగనమల రమేష్‌కు ఇప్పుడిప్పుడే బెయిల్ వస్తుందా, రాదా అనేది అనుమానంగానే ఉంది.

English summary
Hyderabad Nampally court issued bail to film producer C Kalyan today. He was arrested in two cases.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X