వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెజవాడ బఫూన్ లగడపాటి: అంబటి రాంబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
గుంటూరు: కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై రామ్ గోపాల్ వర్మ బెజవాడ బఫూన్ సినిమా తీయాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యంగ్యంగా అన్నారు. బెజవాడ రౌడీలు సినిమా ఆడుతుందో లేదో తెలియదు గానీ బెజవాడ బఫూన్ సినిమా మాత్రం బాగా ఆడుతుందని ఆయన అన్నారు. విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ వ్యాఖ్యలతో వైఎస్ రాజశేఖరరెడ్డి విమాన ప్రమాదంపై మరింతగా అనుమానాలు బలపడుతున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వాతావరణం బాగా లేకపోతే హెలికాప్టర్‌ను ఎందుకు బయటకు తీశారని, అందులో అప్పటి స్పీకర్ కిరణ్‌కుమార్‌రెడ్డి ఎందుకు ఎక్కలేదో సమాధానం ఇవ్వాలని, లేకుంటే వైఎస్‌ను హత్య చేసినట్లు ఒప్పుకోవాలన్నారు. అంతేగానీ వైఎస్ కుటుంబంతో పాటు, జగన్‌పై ఆరోపణనలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.

దమ్ముంటే లగడపాటి తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై పోటీ చేసి గెలవాలని అంబటి సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదో మున్ముందు తెలుస్తుందన్నారు. బెజవాడ ప్రజలు లగడపాటికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. డబ్బు మదంతోనే లగడపాటి ఇష్టమొచ్చినట్లు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రను అపవిత్రం చేయటానికి లగడపాటి యత్నించారని అంబటి అన్నారు. పాదయాత్ర సమయంలో ఏసీ వ్యానులో విశ్రాంతి తీసుకున్న వ్యక్తికి వైఎస్ పాదయాత్ర గురించి మాట్లాడే చిత్తశుద్ది లేదన్నారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు లగడపాటి ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు.

English summary
YSR Congress party leader Ambati Rambabu retaliated Congress MP Lagagdapati Rajagopal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X