• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాజీనామాలపై మీరాకుమార్ దారిలో మనోహర్

By Pratap
|

Nadendla Manohar
హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలపై శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ లోకసభ స్పీకర్ మీరా కుమార్ దారిలో నడవాలని అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ లోకసభ సభ్యులు చేసిన రాజీనామాలపై మీరాకుమార్ తీసుకునే నిర్ణయానికి అనుగుణంగానే మనోహర్ తెలంగాణ శాసనసభ్యుల రాజీనామాలపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు 18 మంది శనివారం ఉదయం స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిశారు. తమ రాజీనామాలను ఆమోదించాలని వారు మనోహర్‌ను కోరారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన నాగం జనార్దన్ రెడ్డి ప్రభృతులు శుక్రవారం మనోహర్‌ను కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 13 మంది తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు రాజీనామాలు చేశారు. వారి రాజీనామాలపై ఆగస్టు 1వ తేదీలోగా నిర్ణయం తీసుకుంటానని మీరా కుమార్ ఇటీవల చెప్పారు. లోకసభ సభ్యుల రాజీనామాలపై మీరా కుమార్ నిర్ణయం తీసుకునే వరకు వేచి చూసి, ఆమె అనుసరించిన విధానాన్నే శాసనసభ్యుల రాజీనామాల విషయంలో అనుసరించాలని మనోహర్ అనుకుంటున్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు రాజీనామాలు చేసిన సమయంలో మనోహర్ స్థానికంగా లేరు. ఆయన అమెరికాలో ఉన్నారు. తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు తమ రాజీనామా లేఖలను డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కకు అందించారు. దీన్నిబట్టి శాసనసభ్యుల రాజీనామాలపై ఈ నెలాఖరు వరకు కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

English summary
Assembly speaker Nadendla Manohar will follow Loksabha speaker Meerakumar on Telangana MLAs resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X