హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ సంబంధం కారణంగా యువకుడి హత్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్‌: హైదరాబాద్ నగర శివారులోని పౌల్ట్రీఫామ్‌లో ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందన్‌పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. లక్ష్మీ పౌల్ట్రీస్‌లో పనిచేసున్న వెంకటయ్య వద్దకు వచ్చిన బంధువు ఈ హత్యకు గురయ్యాడు. వైవాహికేతర సంబంధమే కారణమై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

హత్య జరిగిన తర్వాత వెంకటయ్య కుటుంబం కనిపించకుండా పోయింది. వెంకటయ్య కుటుంబ సభ్యులే అతన్ని హత్య చేసి ఉంటారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చెట్టుకు లుంగీతో కట్టేసి అతన్ని చంపారు. హతుడు నల్లగొండవాసి కావచ్చునని భావిస్తున్నారు. వెంకటయ్య కుటుంబ సభ్యుల ఆరా కోసం, యువకుడి ఆనవాళ్ల కోసం నల్లగొండకు ఓ పోలీసు బృందం వెళ్లింది.

English summary
A youth killed in outskirts of Hyderababd city. It is said that the victim belongs to Nalgonda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X