వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర సేనను చూస్తే భయమేస్తుంది!: విహెచ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
న్యూఢిల్లీ: కాంగ్రెసు పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు మంత్రి టిజి వెంకటేష్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన సీమాంధ్ర సేన తనను భయానికి గురి చేస్తుందని ఆదివారం న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ అన్నారు. ప్రత్యేక సీమాంధ్ర సైనిక దళం ఎందుకో టిజి వెంకటేష్ వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. టిజి సేన వ్యాఖ్యలపై డిజిపి దినేష్ రెడ్డి వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

2004లో తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకున్న సమయంలో అభ్యంతరం లేనప్పుడు తెలంగాణపై ఇప్పుడే అభ్యంతరం ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. సమైక్యవాదం కోసం సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ఢిల్లీ రావడం సరికాదన్నారు. ఢిల్లీకి వచ్చి సమైక్యాంధ్ర కోరుతున్న సీమాంధ్ర నాయకులలో తెలంగాణ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు. తెలంగాణకు ఉన్న పరిస్థితులు వేరని అన్నారు.

English summary
Congress senior leader V Hanumantha Rao said today that he is afraid of TG Venkatesh Seemandhra Sena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X