కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్టీ పెట్టినందుకే తప్పుడు కేసులు: వైయస్ జగన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: కాంగ్రెసు పార్టీని వీడి తాను వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ పెట్టినందుకే తనపై తప్పుడు కేసులు బనాయించి సిబిఐ దర్యాఫ్తు చేపట్టారని ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం కర్నూలు జిల్లాలోని ఓదార్పు యాత్రలో విమర్శించారు. కర్నూలు జిల్లాలో పదమూడు రోజుల ఓదార్పు యాత్రలో భాగంగా సోమవారం ఉదయం ఆళ్లగడ్డ నుండి ప్రారంభమయింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. కాంగ్రెసు పెద్దలు దురుద్దేశ్యంతోనే యువకుడిని అయిన తనపై కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు రెండు ఏకమై తనను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి తన ఆస్తులపై దాడులు చేయిస్తున్నాయని అన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎదుర్కొంటానని అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి మరణించి రెండేళ్లైనా పేదవారికి ఒక్క రేషన్ కార్డు, ఇళ్లు కాంగ్రెసు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. వైయస్ పథకగాలు అమలు చేసేందుకు ఏ ఒక్క కాంగ్రెసు నేత కూడా ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. కాగా ఓదార్పు యాత్రలో పాల్గొన్న పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ దివంగత వైయస్ పథకాలు నిజమైన పేదలకు చేరాలంటే జగన్‌కే సాధ్యమని అన్నారు. తనకు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలవడానికి వైయస్ అవకాశం ఇచ్చారని అన్నారు. జగన్ అడుగుజాడల్లో నడుస్తానని ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఓదార్పు యాత్రలో ఎమ్మిగనూరు శాసనసభ్యుడు చెన్నకేశవరెడ్డి, టిడిపి అసమ్మతి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
YSR Congress party president YS Jaganmohan Reddy blamed Congress party for CBI probe on his properties.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X