అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యసాయి యజుర్మందిరంలో నేలమాళిగలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: శ్రీ సత్యసాయి బాబా నివాసం ఉన్న యజుర్మందిరంలో నేలమాళిగలు ఉన్నట్లు అనంతపురం జిల్లా కలెక్టర్ దుర్గాదాస్ అనుమానం వ్యక్తం చేశారు. యజుర్వేద మందిరంలో రెండో రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. మూడు గదులలో ఉన్న నిధులను బుధవారం వరకు తనిఖీ చేయనున్నారు. కాగా రూ. 27 లక్షలు ఉన్న సూట్‌కేస్‌ని స్వాధీనం చేసుకున్నట్లు కలెక్టర్ చెప్పారు.

రెండో రోజు కొనసాగుతున్న ఆస్తుల లెక్కింపులో భారీగా బంగారం, వెండి నగలు ఉన్నట్లు ఆయన తెలిపారు. యజుర్మందిరంలోని గ్రీన్ రూంలో భారీగా నగదు, వెండి, బంగారు ఆభరణాలు ఉండి ఉండవచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వరకు పూర్ణచంద్ర హాలులో తనిఖీలు పూర్తవుతాయని చెప్పారు. కాగా తనిఖీల్లో ఐదుగురు తహసీల్దార్లు పాల్గొన్నారు.

English summary
Anantapur district collector Durgadas suspected that Nelamaligalu in Bhagvan Sri Sathya Sai Baba's Yajur Mandiram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X