వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని భేటీకి పురంధేశ్వరి, చంద్రదేవ్ డుమ్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Purandeswari
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల భేటీకి పలువురు కేంద్ర మంత్రులు మంగళవారం గైర్హాజరయ్యారు. కేబినెట్ మంత్రి కిషోర్ చంద్రదేవ్, సహాయ మంత్రులు దగ్గుపాటి పురందేశ్వరి, పనబాక లక్ష్మిలు ప్రధానితో సీమాంధ్ర ప్రజల భేటీకీ వెళ్లలేదు. రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని ముక్కలు చేయవద్దన్న తమ వాదనను ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లేందుకు సీమాంధ్రకు చెందిన సుమారు 70 మంది వరకు ప్రజాప్రతినిధులు ఢిల్లీలో ప్రధాని నివాసంలో కలిశారు. ఇందులో ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పలువురు ఉన్నారు.

కాగా గతంలోనూ తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు ప్రధానమంత్రిని కలిసిన సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గైర్హాజరయ్యారు. తాను కేబినెట్ మంత్రిని అయినందునే భేటీకి వెళ్లలేదని జైపాల్ రెడ్డి తర్వాత వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రాంత మంత్రులు సైతం అదే విషయం చెప్పారు. ఆ తర్వాత ప్రధానిని జైపాల్ రెడ్డి స్వయంగా కలిసి తెలంగాణ ఇవ్వాల్సిందిగా కోరారు.

English summary
Union Ministers Purandeswari, Kishore Chandradev and Panabaka Laxmi absented to Seemandhra leaders Prime Minister Manmohan Singh meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X