అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి మందిరంలో 34.5 కిలోల బంగారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
అనంతపురం: పుట్టపర్తి పూర్వపు నివాస మందిరంలోని నాలుగు గదులతో పాటు సమీప భవంతిలోని ఆరు గదుల్లో సోమవారం సంపద లెక్కించినట్లు జిల్లా కలెక్టరు దుర్గాదాస్‌ తెలిపారు. ఈ గదుల్లో అపార సంపద లభ్యమైనట్లు ఆయన చెప్పారు. సోమవారం ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన లెక్కింపు రాత్రి పది గంటల వరకూ సాగిందన్నారు. సోమవారం నిర్వహించిన సంపద లెక్కింపులో 34.5 కిలోల బంగారం, 340 కిలోల వెండి, రూ.1.90 కోట్లు నగదును గుర్తించామని ఆయన చెప్పారు.

వాటితోపాటు పట్టు వస్త్రాలు, గడియారాలు తదితర వస్తువులు ఉన్నట్లు కలెక్టరు తెలిపారు. మిగిలిన గదుల్లోని సంపదను మంగళవారం లెక్కిస్తామన్నారు. ట్రస్టు సభ్యులు పి.ఎన్‌భగవతి, ఇందులాల్‌షా, శ్రీనివాసన్‌, రత్నాకర్‌, ఎస్‌.వి.గిరి, చక్రవర్తి, బాబా వ్యక్తిగత సహాయకుడు సత్యజిత్‌, ఆర్డీఓ ఈశ్వర్‌, ప్రత్యేకాధికారి వెంకటేశం, తదితరులు సంపద లెక్కింపులో పాల్గొన్నారు.

సత్యసాయి సేవా ట్రస్టు ప్రభుత్వానికి ఇచ్చిన పత్రాల పరిశీలన వేగంగా జరుగుతోంది. 20వ తేదీ నాటికి వాటిని పూర్తిగా అధ్యయనం చేసి వివరాలను అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ప్రత్యేకంగా నియమించిన కమిటీ సభ్యులు పరిశీలనను వేగవంతం చేశారు. ప్రభుత్వం జారీ చేసిన నోటీసుల మేరకు వివరాలు అందించారా? లేదా? అని చూస్తున్నారు.

English summary
34.5 kgs gold was found in Sathya Sai Baba's mandir at Prashanthi Nilayam of Puttaparthi in Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X