ఈజిప్ట్ పార్లమెంట్ ఎన్నికలను అక్టోబర్లో మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు ఈజిప్ట్ ఆర్మీ కౌన్సిల్ దేశ రాజధాని కైరోలో వెల్లడించింది. ఎన్నికల ఏర్పాట్లు సెప్టెంబర్లో ప్రారంభమవుతాయని ఆర్మీ సుప్రీం కౌన్సిల్లో సభ్యుడైన రక్షణ శాఖ సహాయ మంత్రి మమ్దూహ్ షాహీన్ తెలిపారు. 504 సీట్లు వున్న దిగువ సభ పీపుల్స్ అసెంబ్లీ, 390 సీట్లు వున్న ఎగువ సభకు ఓటింగ్ ఒకేసారి జరుగుతుందని షాహిన్ చెప్పారు. మూడో రౌండ్లో జరిగే ఓటింగ్ లో ప్రతి రౌండ్ కు మధ్య పదిహేను రోజుల విరామం వుంటుంది. పార్లమెంట్లోని సగం సీట్లను రైతులు, కార్మికుల ప్రతినిదుల కోసం రిజర్వ్ చేయడం విశేషం. ప్రజాందోళనలతో హోస్నీ ముబారక్ వైదొలగడంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువుతీరే వరకూ ఆర్మీ కౌన్సిల్ పాలనా వ్యవహారాలు చూసుకుంటుంది.
Army Council announced that Elections to Ezypt Parliament will be conducted in three phases. Election arrangements will start in September . Lower House is having 504 seats and upper house is 390 seats. Significant factor here is Half of the parliament seats reserved for farmers and labour representatives.