హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోడలి ఆరోపణలు: గుండెపోటుతో మాజీ ఎంపీ మృతి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akarapu Sudarshan
హైదరాబాద్: అత్తింటి వారు తనను వేధిస్తున్నారనే తన కోడలు ఆరోపణలను ఓ టీవీ ఛానల్లో చూస్తూ మాజీ రాజ్యసభ సభ్యుడు ఆకారపు సుదర్శన్ గుండెపోటుతో మృతి చెందారు. ఎల్బీ నగర్‌లోని తన కూతురు రమ ఉంటున్న రాఘవేంద్ర అపార్టుమెంటులో విశ్రాంతి తీసుకుంటుండగా ఓ టీవీలో తన కోడలు సుధ తనకు తన అత్తింటి వారి నుండి తీవ్ర వేధింపులు వస్తున్నాయని ఆరోపించినట్లుగా తెలుస్తోంది. ఆమె ఆరోపణలు తట్టుకోలేక అతనికి గుండె నొప్పి వచ్చినట్లుగా భావిస్తున్నారు. గుండె నొప్పి వచ్చిన ఆకారపును హాస్పిటల్ తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించారు.

ఆకారపు సుదర్శన్ రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పని చేశారు. 1987లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆకారపు మృతదేహాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్, రాష్ట్ర మంత్రులు జానారాడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు మోత్కుపల్లి నరసింహులు, ఉమా మాధవరెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు.

English summary
Ex MP Akarapu Sudarshan died yester day in Hyderabad with heart attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X