కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లా బంద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kadapa
కడప: సమైక్యాంధ్రకు మద్దతుగా కడప జిల్లాలో సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి బందుకు పిలుపు నిచ్చింది. ఈ బందుకు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు ప్రకటించాయి. బందు సందర్భంగా కొన్ని చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమైక్యాంధ్ర మద్దతుదారులు కడప జిల్లాలో వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పెట్రోలు బంకుపై దాడి చేశారు. పెట్రోలు బంకులో సామాగ్రిని బయట పారేశారు. బందుకు మద్దతుగా బంకును మూసేయాలని హెచ్చరించారు. మరో చోట ఆర్టీసీ అధికారులతో సీమాంధ్ర ఐకాస నేతలకు మధ్య కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు.

ప్రైవేటు, ఆర్టీసీ వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. ఎనిమిది డిపోలలోని అన్ని బస్సులను ఎక్కడా తిరగకుండా అడ్డుకున్నారు. జిల్లాలో వ్యాపారసముదాయాలు స్వచ్చంధంగా మూసివేశారు. రోడ్డుపై తిరుగుతున్న లారీల అద్దాలు పగలగొట్టారు. సమైక్యాంధ్రకు తమ సంపూర్ణ మద్దతు తెలపడానికి బందు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
Samaikyandhra JAC organizing bandh for united Andhra Pradesh today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X