వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫోన్ హ్యాకింగ్ బ్రిటన్ రాజకీయ సంక్షోభానికి దారితీయనుందా..?

|
Google Oneindia TeluguNews

Phone Hacking
అవును మీరు విన్నది నిజమే... అనుక్షణం సంచలన వార్తలను వెలికితీస్తూ పాఠాకుల సంఖ్యను అమాంతంగా పెంచుకుని ప్రపంచ వ్యాప్తంగా మీడియా మహారాజుగా వెలుగొందిన రూపర్ట్ మర్డోక్ ప్రస్తుత పరిణామాలతో జీరో అయిపోయారు. ప్రపంచాన్ని మొత్తాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తటంతో పాటు బ్రిటన్ పార్లమెంటును కుదిపేసిన ఫోన్ హ్యాకింగ్ వ్యవహారం రారాజు మీడియా కోటను కుప్పకూల్చింది. 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్ " 168 సంవత్సరాల సదీర్ఘ ప్రస్థానం ముగియటంతో పాటు హ్యాకింగ్ కు పాల్పడిన అక్రమార్కులందరూ ఇప్పడు కోర్టు బోనెక్కుతున్నారు.

అసలు సమాజంలో మీడియా పాత్ర ఏంటి..? ఏది తప్పో.. ఏది ఒప్పో ప్రజలకు వివరించటంతో పాటు, వారిలో చైతన్యాన్ని తీసుకురావాలి. నవ సమాజ నిర్మాణానికి దోహద పడాల్సిన మీడియా హద్దు దాటి వెర్రి పుంతుల తొక్కితే.. ఇలాంటి అంశాలకు మీడియా మోఘుల్ రూపర్ట్ మర్డోక్ హ్యాకింగ్ వ్యవహారం కేంద్ర భిందువులా నిలిచింది. పోలీసు వ్యవస్థతో జత కలిసి.. చట్ట విరుద్ధమైన లంచాలను ఎరవేసి రారాజు టీమ్ చేసిన ఆన్యాయాలను బ్రిటన్ పార్లమెంట్ కడిగిపారేసింది. బ్రిటన్ ప్రధాని కామారాన్ పైనా పార్లమెంట్ చిందులేసింది. వివాదస్పద పత్రిక న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రిక మాజీ ఉద్యోగిని సలహాదారుగా నియమించుకోవడంతో బ్రిటన్ ప్రధాని మెడకు ఈ వివాదం చుట్టుకుంటోంది.

సెప్టంబర్ 11 ఉగ్రవాద దాడుల్లో బాధిత కుటుంబాల ఫోన్లను కూడా న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రిక హ్యాక్ చేసినట్లు వార్తలు వెలుగులోకి రావటంతో ఆ సంస్థ అధిపతికి మరిన్ని కష్టాలు పెరిగాయి. సంచలనాల కోసం ప్రముఖుల ఫోన్లను.. వారి వాయిస్ మెయిల్ బాక్స్ లను హ్యాక్ చేసిన ఈ పత్రిక వ్యవహారం ఆ దేశ రాజీకీయ సంక్షోభానికి దారి తీస్తోంది. పత్రికకు సంబంధించిన మాజీ ఉద్యోగులను ప్రధాని వ్యక్తిగత సిబ్బందిగా నియమించుకోవడం పట్ల విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ కారణంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామరాన్ హౌస్ ఆఫ్ కామన్స్ ఎదుట దోషిలా నిలబడాల్సి వచ్చింది. రాజకీయ ప్రత్యర్ధుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు న్యూస్ ఆప్ ది వరల్డ్ సిబ్బంది సహకారాన్ని తీసుకున్నారనే విమర్శలు ఎక్కువ అవడంతో డేవిడ్ కామరాన్ మరిన్ని కష్టాల్లో పడిపోయారు.

వరసగా రెండో రోజు జరిగిన విచారణకు న్యూస్ ఆఫ్ ది వరల్డ్ పత్రికాధిపతి రూపర్ట్ మర్డోక్ తో పాటు అతని కొడుకు జేమ్స్, బ్రిటన్ ప్రధాని కామరాన్ లు కూడా హాజరయ్యారు. విచారణలో బ్రిటన్ పార్టమెంటు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మర్డోక్.. కామరాన్ లు ఒపిగ్గా సమాధానమిచ్చారు. తన పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండిస్తూ .. ప్రతిపక్షాలు న్యూస్ ఆఫ్ ది వరల్డ్ యాజమాన్యంతో ఉన్న సంబంధాలను బయటపెట్టాలని సవాల్ చేశారు. ఆ పత్రిక మాజీ ఎడిటర్ అండీ కౌన్సల్ ను తన కమ్యూనికేషన్స్ కార్యదర్శిగా నియమించకోడాన్ని సమర్థించుకుంటునే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అతని పాత్ర పట్ల విచారం వ్యక్తం చేశారు.

ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో పోలీసులు అరెస్టు చేసిన అండీ కౌన్సల్ ను బ్రిటన్ ప్రధానికి హౌస్ ఆఫ్ కామన్స్ లో క్షమాపణ చేప్పారు. హ్యాకింగ్ వ్యవహారంలో ప్రధానికి ఏమాత్రం సంబంధంలేదని.. రాజకీయ లబ్థి కోసమే ఆయనను ఇందులోకి లాగుతున్నారని పార్లమెంట్ కు వివరణ ఇచ్చారు. మరో వైపు బ్రిటన్ పార్లమెంటుకు వేసవి విరామం రావడంతో విచారణ వాయిదా పడనుంది. వివాదస్పద పత్రికాధిపతి రూపర్ట్ మర్డోక్ కూడా లండన్ విడిచి వెళ్లి పోయారు. ఈ రెండు నెలల వేసవి విరామంలో అన్ని రాజకీయ పక్షాల సహకారం తీసుకుని ఈ సంక్షోభం నుంచి బయటపడాలని ప్రధాని కామరాన్ భావిస్తున్నారు.

English summary
In the cut and thrust of British tabloid journalism, the fact that 'News of the World' illegally accessed mobile phones to ferret out information to be used in sensational stories is not exactly breaking news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X