వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ తర్వాత నేనే: ముఖ్యమంత్రి సంబూరం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
చిత్తూరు: మంత్రిగా పనిచేయకుండా ముఖ్యమంత్రి పదవి చేపట్టింది ఎన్‌టి రామారావు, తాను మాత్రమేనని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకున్నారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం పీలేరులో ఓ సమావేశంలో శుక్రవారం మాట్లాడుతూ ఆ పోలిక తెచ్చుకున్నారు. తనకు స్పీకర్ పదవి వచ్చినప్పుడు మంత్రి పదవి రాలేదని చాలా మంది బాధపడ్డారని, స్పీకర్ పదవి మంత్రి పదవి కన్నా పెద్దదని చెప్పినా నమ్మలేదని, మంత్రి పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారని, అయితే అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రిని అయ్యాయని ఆయన అన్నారు. మంత్రి పదవి చేపట్టకుండా నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టింది తానూ ఎన్టీ రామారావు మాత్రమేనని ఆయన అన్నారు. పీలేరులో బయటకు వెళ్లిపోయిన వారు తప్ప ప్రతి ఒక్కరూ తనకు పేరుపేరునా తెలుసునని ఆయన చెప్పారు.

కాగా, తెలంగాణ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగించాలని ప్రభుత్వం అనుకుంటోందని మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన అంతకు ముందు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్మా ప్రయోగిస్తారని మీకు ఎవరు చెప్పారు, మీరే అంటారు, మీరే రాసుకుంటారా అని ఆయన అన్నారు. తెలంగాణ మంత్రుల రాజీనామాల వల్ల పాలన కాస్తా స్తంభించిన మాట నిజమేనని ఆయన అన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి రాజ్యాంగం హక్కు కల్పించిందని ఆయన అన్నారు. జగన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది కాబట్టి హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రాథమిక దర్యాప్తు సాగుతుందని ఆయన అన్నారు.

English summary
CM Kirankumar Reddy compared himself with NT Rama Rao. He said that he and NTR became chief minister without working as ministers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X