వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు నెలల గడువు

By Pratap
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: తెలంగాణ సమస్య పరిష్కారానికి రెండు నెలలు పడుతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ కాంగ్రెసు తెలంగాణ ప్రతినిధులకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చైనాలో తాను చేసిన ప్రకటనను, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసినట్లు వచ్చిన ప్రకటనను మీడియా వక్రీకరించిందని ఆయన వారికి చెప్పినట్లు తెలుస్తోంది. సమస్య పరిష్కారానికి మీతోనూ మాట్లాడుతాను, సీమాంధ్ర నాయకులతోనూ మాట్లాడుతామని, తప్పకుండా పరిష్కారం చూపుతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. వివిధ అభిప్రాయాలను పరిశీలించి ఓ నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.

అయితే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రత్యామ్నాయం లేదని తెలంగాణ నాయకులు చెప్పినట్లు తెలుస్తోంది. కె. కేశవరావు, కె. జానారెడ్డి నాయకత్వంలోని పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆయనను కలిసింది. రాష్ట్ర విభజన జరగాల్సిందేనని, మరో ప్రత్యామ్నాయం లేదని మంత్రి శ్రీధర్ బాబు తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రులు విధులకు హాజరు కావాలనే ఆజాద్ సూచనను మంత్రి గీతారెడ్డి తోసిపుచ్చినట్లు తెలుస్తోంది. ప్రకటనలో జాప్యం చేస్తూ విధులకు హాజరు కావాలంటే కుదరదని ఆమె చెప్పారని సమాచారం. ఏ విధమైన హామీ పార్టీ అధిష్టానం నుంచి రాకుండా విధులకు హాజరైతే తమను ద్రోహులుగా పరిగణిస్తారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే కాంగ్రెసు వచ్చే ఎన్నికల్లో 19 పార్లమెంటు సీట్లలో 16 గెలుస్తుందని పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమే తమకు కావాలని తెలంగాణ ప్రతినిధులంతా స్పష్టంగా చెప్పినట్లు సమాచారం.

English summary
Congress general secretary Ghulam Nabi Azad told Telangana Congress leaders not to go by media reports on the separate state issue and that no final decision has been taken on it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X