హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుణ్ సందేశ్‌పై మాట మార్చిన నాగ సిద్ధార్థ

By Pratap
|
Google Oneindia TeluguNews

Varun Sandesh
హైదరాబాద్: డ్రగ్స్ వ్యవహారంలో హీరో వరుణ్ సందేశ్ పాత్రపై జూనియర్ ఆర్టిస్టు నాగ సిద్ధార్థ మాట మార్చాడు. తాను వరుణ్ సందేశ్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో చెప్పిన ఆయన తర్వాత మాట మార్చాడు. వరణ్ సందేశ్‌తో తనకు పరిచయం ఉందని, అయితే తాను వరుణ్‌కు డ్రగ్స్ అందింలేదని ఆ తర్వాత మీడియా ప్రతినిధులతో చెప్పారు. నాగసిద్ధార్థను పోలీసులు శుక్రవారం రాత్రి మీడియా ముందు హాజరు పరిచారు. కొకైన్‌తో నాగసిద్ధార్థను, నైజీరియన్ ఫ్రెడరిక్‌ను పోలీసులు శుక్రవారంనాడు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. వరుణ్ సందేశ్, మరో హీరో అభిషేక్, నిర్మాత ఉప్పలపాటి రవిలకు తాము డ్రగ్స్ అందిస్తున్నట్లు వారు పోలీసు విచారణలో తెలిపారు.

తనకు డ్రగ్స్ తీసుకనే అలవాటు లేదని వరుణ్ సందేశ్ చెప్పాడు. తాము వరుణ్ సందేశ్, ఉప్పలపాటి రవిలతో పాటు మరో వ్యక్తిని తాము విచారిస్తామని పోలీసులు చెబుతున్నారు. తనకు బెంగళూర్‌లో ఫ్రెడరిక్ పరిచయమైనట్లు సిద్ధార్థ చెప్పాడు. నిందితుల నుంచి పోలీసులు కొకైన్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు. వరుణ్ సందేశ్ తనకు మిత్రుడు మాత్రమేనని సిద్ధార్థ చెప్పాడు.

English summary
Naga Siddhartha, who was nabbed by police in drugs case, changed his words on Varun Sandesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X