మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ కోసం రాజీనామా చేయను: నందీశ్వర్ గౌడ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nandeshwar Goud
మెదక్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి రాజీనామా చేసే ప్రసక్తి లేదని మెదక్ జిల్లా పటాన్‌చెరు శాసనసభ్యుడు నందీశ్వర్ గౌడ్ ఆదివారం అన్నారు. తెలంగాణ కోసం అంటూ ఇప్పటికి రెండుసార్లు రాజీనామాలు సమర్పించామని అన్నారు. మరోసారి రాజీనామాలు చేసే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. రెండు సార్లు రాజీనామాలు చేస్తే సభాపతి తిరస్కరించారని అన్నారు. రాజీనామాల వ్యవహారం ఓ డ్రామాలాగా సాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అధిష్టానంతో చర్చల ద్వారా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని చెప్పారు.

కాగా తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సాయంత్రం నాలుగు గంటలకు మంత్రి జానారెడ్డి నివాసంలో సమావేశం కానున్నారు. రాజీనామాలు స్పీకరు ఆమోదించక పోవడంతో భవిష్యత్తు నిర్ణయం తీసుకోనున్నారు. స్పీకరు రాజీనామాలు ఆమోదించక పోవడం సరికాదని స్టేషన్ ఘనపురం ఎమ్మెల్యే రాజయ్య వరంగల్ జిల్లాలో అన్నారు. స్పీకరును మరోసారి కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరతామని ఆయన చెప్పారు.

English summary
MLA Nandishwar Goud said today that he will not resigned for Telangana second time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X