వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష?

By Pratap
|
Google Oneindia TeluguNews

Varun Sandesh
హైదరాబాద్: తెలుగు యువ హీరో వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించే ఆలోచనలో పోలీసులు ఉన్నారు. డ్రగ్ రాకెట్‌లో వరుణ్ సందేశ్‌తో పాటు మరో యువ హీరో అభిషేక్, నిర్మాత ఉప్పలపాటి రవి చిక్కుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. డాక్టర్ నాగ సిద్ధార్థ, నైజీరియన్ ఫ్రెడ్రెరిక్‌ను 25 గ్రాముల కొకైన్‌తో పోలీసులు పట్టుకోవడంతో వారి పేర్లు బయటకు వచ్చాయి. తాను వరుణ్ సందేశ్‌కు డ్రగ్స్ అందజేసినట్లు పోలీసు విచారణలో అంగీకరించిన సిద్ధార్థ ఆ తర్వాత మాట మార్చాడు. హైదరాబాదులోని అశోక్‌నగర్‌లో గల తన ఇంటికి వరుణ్ నాలుగు సార్లు వచ్చినట్లు కూడా విచారణలో చెప్పాడు. అయితే ఆ తర్వాత వరుణ్ సందేశ్‌కు తాను డ్రగ్స్ ఇవ్వలేదని చెప్పాడు. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు వచ్చిన వార్తలను వరుణ్ సందేశ్ కూడా ఖండించాడు.

నాగ సిద్ధార్థ మాట మార్చిన నేపథ్యంలో పోలీసులు వరుణ్ సందేశ్‌కు పాలిగ్రాఫ్ పరీక్ష చేయనున్నారు. ఇందుకు గాను తాము కోర్టు అనుమతి తీసుకున్నట్లు వారు తెలిపారు. నాగ సిద్ధార్థ, వరుణ్ సందేశ్‌ల ఫోన్ కాల్స్ పరిశీలిస్తామని, ఆ తర్వాత వరుణ్ సందేశ్‌ను విచారిస్తామని వారంటున్నారు. ఈ కేసు మంగళవారం ముందుకు వస్తుందని కూడా అంటున్నారు. నాగ సిద్ధార్థ ఫోన్ కాల్స్ ఆధారంగా సినీ పరిశ్రమకు చెందినవారు ఎవరెవరు ఈ డ్రగ్ రాకెట్లో ఉన్నారనే విషయంపై ఆరా తీయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
Police are in a plan to conduct polygraph test on Telugu hero Varun sandesh in drug rocket case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X