వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రి కాన్వాయ్ కారులో పాము కలకలం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
నెల్లూరు: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లోని ఓ కారులో చేరిన పాము కాసేపు కలకలం సృష్టించింది కాకుటూరు వద్ద ఏర్పాటు చేసిన సభాప్రాంగణం వద్ద సిఎం కాన్వాయ్‌లోని ఒక వాహనంలోకి పాము దూరింది. దాంతో అక్కడ కొద్దిసేపు కలకలం ఏర్పడింది. పాము దూరిన వాహనాన్ని పోలీసులు గుర్తించి, దానిని కాన్వాయ్ నుంచి తొలగించారు. కారులో నుండి ఆ పామును తొలగించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. సింహపురి యూనివర్సిటీ భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి అక్కడ శంకుస్థాపన చేయవలసి ఉంది. ఈ సంఘటనను స్థానికులు అపశకునంగా భావిస్తున్నారు.

కాగా ఆదివారం ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పొదలకూరు రోడ్డులో భూగర్భ డ్రైనేజీ పనులకు, త్రాగునీటి పథకానికి, కలెక్టరేట్ కాంప్లెక్స్, మున్సిపల్ పరిధిలో 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు, బాలుర కోసం ప్రత్యేకంగా నిర్మించనున్న ఎపి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపనలో పాల్గొంటారు.

English summary
A snake created tension in CM kiran Kumar Reddy canvay today in SPS Nellore district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X