వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అధిష్టానానికి మరో అవకాశం: టి-కాంగ్రెసు యోచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తమ పార్టీ అధిష్టానానికి మరో అవకాశం ఇచ్చే యోచనలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం వారు టి-కాంగ్రెసు నేతలు భేటీ అయి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. వారు నాలుగు ప్రత్యామ్నాయాలపై యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒకటి రాజీనామాలు తిరస్కరించిన స్పీకరు నాదెండ్ల మనోహర్‌ను కలిసి మరోసారి ఆమోదం కోరటం. రెండోది జానారెడ్డి వద్ద తమ రాజీనామాలు ఉంచడం. తద్వారా రాజీనామాల నిర్ణయం ఆయనకే వదిలేయడం. మూడోది కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌తో చర్చలు జరిగే వరకు ఆగటం. ఇక నాలుగోది మంత్రులు, ఎమ్మెల్యేలు విధులకు దూరంగా ఉండటం వంటి నాలుగు ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా ఈసారి మంత్రుల చేత నేరుగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాలు సమర్పించడంతో పాటు కేంద్రానికి తెలంగాణ అంశంపై మరి కొద్ది రోజులు గడువు ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సాయంత్రం భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. గులాం నబీ ఆజాదుతో చర్చలు కేవలం తెలంగాణ సమస్యకు ఉన్న అడ్డంకులపై చర్చించడానికేనని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పడం ద్వారా ఆజాదుతో చర్చల వరకు రాజీనామాల నిర్ణయంపై అంతగా స్పందించే అవకాశం లేనట్లుగా తెలుస్తోంది.

English summary
Telangana Congress leaders are thinking to give time to high command on Telangana issue. They will met in Jana Reddy's residence today evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X