వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అందుకే ఢిల్లీ వెళ్లారా?: రాజీనామాకు సై అన్న టిటిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోసం మరోసారి రాజీనామాలు చేసేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు ఆదివారం విలేకరుల సమావేశంలో చెప్పారు. ఎర్రబెల్లి దయాకర రావు, మోత్కుపల్లి నరసింహులు, ఎల్ రమణ తదితర శాసనసభ్యులు భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ కోసం పార్టీలకతీతంగా అందరూ మరోమారు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులు సైతం తమ రాజీనామాలను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ చేపట్టిన జెండా పండుగను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వడానికి సిద్ధంగా లేదని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజద్‌తో వ్యాఖ్యలతో అర్థమవుతోందన్నారు. తెలంగాణ వచ్చే వరకు తాము పోరాటం ఆపేది లేదన్నారు. తెలంగాణపై కాంగ్రెసు పార్టీ నిర్ణయాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. న్యూఢిల్లీ వెళ్లిన తెలంగాణ నేతలు తెలంగాణ తీసుకు వస్తారనుకుంటే రాజీ కుదుర్చుకొని వచ్చినట్లున్నారని విమర్సించారు. రాజీనామాల ఉపసంహరణ కోసమే వారు ఢిల్లీ వెళ్లినట్లుగా కనిపిస్తోందన్నారు. కేంద్రం బుజ్జగింపు చర్యలకు వారు లొంగినట్లుగా కనిపిస్తోందన్నారు.

కాగా టిటిడిపి సోమవారం మరోసారి భేటీ కానుంది. రాజీనామాలపై స్పీకర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అరోపించారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయనిపుణుల ద్వారా కోర్టుకు వెళతామని చెప్పారు. కాగా అంతకుముందు భేటీలో రాజీనామాల చర్చ వచ్చినప్పుడు మెజార్టీ సభ్యులు ఇతర పార్టీలతో సంబంధం లేకుండా రాజీనామా చేయాలని సూచించగా, మరికొందరు మిగతా వారి కార్యచరణ చూసి నిర్ణయం తీసుకుందామని చెప్పినట్లుగా తెలుస్తోంది. చివరకు రాజీనామాలవైపు మొగ్గారు.

English summary
Telugudesam party Telangana leaders questioned T-Congress leaders about their attitude.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X