వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి రాజనీతి: రాజకీయాస్త్రంగా కత్రినా కైఫ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Katrina Kaif
ముంబై: బాలీవుడ్ అందాల తార కత్రినా కైఫ్‌ను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బిజెపి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది జరిగే బిఎంసి, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆమెను వాడుకోవాలనే రాజనీతిని బిజెపి అనుసరించాలని ప్రయత్నిస్తోంది. రాహుల్ గాంధీపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఎన్నికల్లో బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. రాహుల్ గాంధీని సగం భారతీయుడని కత్రినా కైఫ్ చేసిన వ్యాఖ్య తమకు ఉపయోగపడుతుందని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. దీంతో ఆమెను పార్టీలోకి తీసుకు రాగలితే చాలా వరకు ప్రయోజనాలు కలుగుతాయనే ఉద్దేశంతో ఆ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెసు నాయకులు కత్రినా కైఫ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాలను ఆ స్థాయికి దిగజార్చవద్దని వారు సలహా ఇచ్చారు. దీంతో కత్రినా కైఫ్ క్షమాపణలు చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పినప్పటికీ విదేశీయతను మళ్లీ తెర మీదికి తెచ్చిన కత్రినా వ్యాఖ్యల వేడి తగ్గబోదని, ఆ వ్యాఖ్యలు చేసిన కత్రినా కైఫ్ ప్రజలను ఆకట్టుకోగలుగుతారని బిజెపి నాయకులు ఆశపడుతున్నారు. కత్రినా కైఫ్ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నామని బిజెపి నగర చీఫ్ రాజ్ కె. పురోహిత్ అంటున్నారు. బహిరంగంగా ఆ విధమైన ప్రకటన చేసిన వ్యక్తి కత్రినా కైఫ్ మాత్రమేనని, ఆమె మాటల్లో అబద్ధం లేదని చెబుతున్నారు. రాజనీతి సినిమాలో సోనియా గాంధీని కత్రినా కైఫ్ అనుకరించింది. బిజెపిలో చేరితే ఆమె ప్రజల ముందుకు అదే గెటప్‌లో రావచ్చునని కూడా భావిస్తున్నారు.

English summary
The BJP has got a foot in edgewise into the uproar surrounding actor Katrina Kaif's statement last week calling Congress scion Rahul Gandhi "half-Indian, half-Italian".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X