వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2జి స్కామ్: రాజా వ్యాఖ్యలతో కాంగ్రెసుకు చిక్కులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలోకి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను, హోం మంత్రి చిదంబరాన్ని టెలికం మాజీ మంత్రి, డిఎంకె నేత లాగడంతో కాంగ్రెసు పార్టీ చిక్కుల్లో పడింది. అనూహ్యంగా రాజా సోమవారం సంచలన ప్రకటన చేశారు. ప్రధానికి తెలియకుండా తాను స్పెక్ట్రమ్ కేటాయింపులు జరపలేదని, చిదంబరం కూడా అందుకు అంగీకరించారని రాజా చెప్పారు. దీంతో యుపిఎ ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. వ్యూహాత్మకంగా కాంగ్రెసు పార్టీని ఇబ్బంది పెట్టేందుకే రాజా ఆ ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు. కాగా, రాజా ప్రకటనను కేంద్ర హోం మంత్రి చిదంబరం ఖండించారు. 2జి స్పెక్ట్రమ్‌తో తనకు ఏ విధమైన సంబంధం లేదని, రాజా చెప్పిన విషయాల్లో నిజం లేదని ఆయన అన్నారు.

కాగా, రాజా ప్రకటనను భారతీయ జనతా పార్టీ (బిజెపి) యుపిఎ ప్రభుత్వంపై ధ్వజమెత్తడానికి ఆయుధంగా వాడుకుంటోంది. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణంలో మన్మోహన్ సింగ్, చిదంబరం కూడా ఉన్నారని బిజెపి జాతీయాధ్యక్షుడు నితన్ గడ్కరీ సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రధాని పాత్రపై సాక్ష్యాధారాలు దొరికాయని ఆయన అన్నారు. మన్మోహన్ సింగ్, చిదంబరం వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ అవినీతిని ప్రోత్సహించారని ఆయన అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంబకోణం రాజాకే పరిమితం కాదని ఆయన అన్నారు. 2జి స్కామ్‌లో అందరికీ భాగం ఉందని రాజానే అంగీకరించారని ఆయన అన్నారు. అధికారంలో కొనసాగే హక్కు యుపిఎకు లేదని ఆయన అన్నారు.

యూనిటెక్, స్వాన్‌లపై చిదంబరం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. రాజా లేఖలపై ప్రధాని ఎందుకు చర్యలు తీసుకోలేని ఆయన అడిగారు.

English summary
Congress is in trouble with former Telecom Minister A Raja's statement on 2G Spectrum scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X