వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధానిని, చిదంబరాన్ని కేసులోకి లాగిన రాజా

By Pratap
|
Google Oneindia TeluguNews

A Raja
న్యూఢిల్లీ: 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులోకి టెలికం మాజీ మంత్రి ఎ. రాజా ప్రధాని మన్మోహన్ సింగ్‌ను, ప్రస్తుత హోం మంత్రి పి. చిదంబరాన్ని లాగారు. స్వాన్, యూనిటెక్ ఈక్విటీ అమ్మకం విషయం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు తెలుసునని ఆయన చెప్పారు. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2జి స్పెక్ట్రమ్ వేలం జరిగిందని ఆయన చెప్పారు. ఈక్విటీ అమ్మకం తప్పు కాదని చిదంబరం ప్రధాని ఎదుటే చెప్పారని, అది విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి పనికి వస్తుందని చిదంబరం అన్నారని ఆయన అన్నారు. తాను చెప్పే విషయాలు నిజం కాదని ప్రధాని చెప్పగలరా అని ఆయన అడిగారు. 2003లో మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు.

తాను ఏ విధమైన తప్పూ చేయలేదని టెలికం మాజీ మంత్రి ఎ. రాజా అన్నారు. 2జి స్పెక్ట్రమ్ కుంభకోణం కేసులో ఆయన సోమవారం సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఒపి సైనీ ముందు తన వాదన వినిపించారు. తనను తాను సమర్థించుకున్నారు. ఎన్‌డిఎ ప్రభుత్వం, తమ ప్రభుత్వం రూపొందిచిన విధానాన్నే తాను అమలు చేశానని ఆయన చెప్పారు. ప్రభుత్వ విధానం తప్పయితే తనకు ముందు ఆ విధానాన్ని అమలు చేసినవారు కూడా జైలుకు రావాల్సిందేనని ఆయన అన్నారు.

విధానాన్ని అమలు చేసిన రాజాను ప్రాసిక్యూట్ చేస్తే 1993 నుంచి అదే విధానాన్ని అనుసరించినవారిని కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందేనని రాజా తరఫు న్యాయవాది సుశీల్ కుమార్ వాదించారు. విధానం తప్పయితే తనకు ముందు దాన్ని అమలు చేసిన టెలికం మంత్రులంతా జైలు పాలు కావాల్సిందేనని రాజా అన్నారు. టెలికం మంత్రిగా అరుణ్ శౌరి 26 లైసెన్సులు, దయానిధి మారన్ 25 లైసెన్సులు, తాను 122 లైసెన్సులు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. సంఖ్య ఇక్కడ ప్రధానం కాదని, వారెవరూ కూడా స్పెక్ట్రమ్‌ను వేలం వేయలేదని ఆయన చెప్పారు. మంత్రివర్గ నిర్ణయాన్ని తాను అమలు చేసినట్లు ఆయన తెలిపారు. తాను 2003 మంత్రి వర్గ నిర్ణయాన్ని అమలు చేసినట్లు ఆయన తెలిపారు.

English summary
Former telecom minister A Raja Monday defended himself against corruption charges in the 2G scam, saying he had not done anything wrong and was merely following the policies pursued by his predecessors and the NDA government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X