వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కల్మాడీకి మతిమరుపు వ్యాధి: విచారణపై దెబ్బ?

By Pratap
|
Google Oneindia TeluguNews

Suresh Kalmadi
న్యూఢిల్లీ: కోట్లాది రూపాయల కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో ఇరుక్కున్న కాంగ్రెసు పూణే పార్లమెంటు సభ్యుడు సురేష్ కల్మాడీకి మతిమరుపు వ్యాధి సోకినట్లు అనుమానిస్తున్నారు. కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం కేసులో అరెస్టయిన రెండు నెలలకు పైగా తీహార్ జైలులో ఉంటున్నాడు. డెమెన్షియా అనే ఈ వ్యాధి వల్ల మతిమరుపు రావడమే కాకుండా హేతుబద్దత కోల్పోతారని, వ్యక్తిత్వంలో మార్పులు వస్తాయని అంటున్నారు. ఇది కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం కేసు విచారణపై తీవ్ర ప్రభావం చూపుతుందని అనుకుంటున్నారు.

కల్మాడీకి ఇటీవల లోక్‌నారాయణ్ జయప్రకాష్ ఆస్పత్రిలో ఎంఆర్ఐ స్కాన్ చేయించారు. కల్మాడీకి డెమెన్షియా ప్రాథమిక స్థాయిలో ఉందని తీహార్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆర్ఎన్ శర్మ చెప్పారు. వైద్య పరీక్షల నివేదికను కల్మాడీ కుటుంబ సభ్యులు జైలు అధికారులకు సమర్పించారు. ఆస్పత్రి నివేదిక కోసం తాము ఎదురు చూస్తున్నామని శర్మ చెప్పారు. కల్మాడీ గత నాలుగైదేళ్లగా ఆ ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన తరఫు న్యాయవాది హితేష్ జైన్ చెప్పారు.

English summary
Suresh Kalmadi, lodged in Tihar jail for more than two months in connection with the multi-crore Commonwealth Games scam, may be suffering from dementia, a disease related to memory loss, impaired reasoning and personality changes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X