హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణపై ఇదే ఫైనల్: అధిష్టానంపై ఒత్తిడికి టి-కాంగ్రెసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ghulam Nabi Azad
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజాప్రతినిధులు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. చర్చల కోసం ఢిల్లీకి వెళ్లిన టి-కాంగ్రెసు నేతలు ఈ సారి అధిష్టానంతో తేల్చుకొని రావడానికే సిద్ధపడ్డట్లుగా తెలుస్తోంది. బెట్టు చేసి ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణపై ఖచ్చితంగా సానుకూల వైఖరి ప్రకటన చేయాల్సిందే అని పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌తో భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

చర్చలతోనే సమస్య పరిష్కారం అని అధిష్టానం సూచించడంతో టి-కాంగ్రెసు తెలంగాణ ఇస్తామనే సానుకూల సంకేతాలు వస్తేనే చర్చలకు సిద్ధమని సమాధానం చెప్పారు. ఆజాద్‌తో భేటీకి ముందు తెలంగాణకు సానుకూల నిర్ణయం రావడంతో పాటు ఆజాద్‌తో భేటీలో తెలంగాణకు సానుకూలం కనిపిస్తేనే తదుపరి చర్చలకు వారు సుముఖంగా ఉంటారని తెలుస్తోంది. ఆ తర్వాతే సీమాంధ్రులతోనూ చర్చలకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో వారికి సానుకూల నిర్ణయాలు కనిపించకపోతే రాజీనామాలపై బెట్టు దిగేందుకు ససేమీరా అనే అవకాశాలే కనిపిస్తున్నాయి. అయితే శనివారం సాయంత్రం రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు పదేళ్లు ఉమ్మడి రాజధాని అనే ప్రతిపాదన తీసుకు వచ్చిన కారణంగా సానుకూతకే ఎక్కువ అస్కారాలు ఉన్నాయని పలువురు భావిస్తున్నారు.

కాగా తెలంగాణ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఈరోజు సాయంత్రం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్‌తో సమావేశం అవుతారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. పార్లమెంటు సభ్యులు మధుయాష్కీ, మందా జగన్నాథం, రాజయ్యలు శనివారం ఢిల్లీ వెళ్లగా రాష్ట్ర మంత్రులు గీతారెడ్డి, జానారెడ్డి, ఎంపీలు వివేక్, కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సోమవారం ఉదయం బయలుదేరారు. ఆజాద్‌తో భేటీకి ముందు టి-కాంగ్రెసు కోర్ కమిటీ భేటీ అయి నిర్ణయం తీసుకుంటారు.

English summary
Telangana Congress leaders will met today union minister Ghulam Nabi Azad today evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X