హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ రాజీనామాలు చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులు మరోసారి రాజీనామా చేశారు. సోమవారం మధ్యాహ్నం పదకొండు మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్యాక్సు ద్వారా తమ రాజీనామాలు స్పీకరు కార్యాలయానికి పంపించారు. రాజీనామాలకు ముందు వారు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ ఆయ్యారు. ఆ తర్వాత అందరూ రాజీనామాలు చేశారు. అందుబాటులో లేని వారి వారి వారి జిల్లాల నుండి రాజీనామాలను సమర్పించారు. కాగా ఈ నెల 4వ తారీఖున తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినప్పటికీ ఉద్రేక పూర్వకంగా నిర్ణయం తీసుకున్న కారణంగా రాజీనామాలు ఆమోదించనని స్పీకరు నాదెండ్ల మనోహర్ శనివారం వారి రాజీనామాలు తిరస్కరించిన విషయం తెలిసిందే.

కాగా తెలంగాణ ప్రజా ప్రతినిధులు అందరూ మరోసారి రాజీనామా చేయాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ సోమవారం పిలుపునిచ్చారు. అందరూ రాజీనామాలు చేయాలని రాజీనామాలు చేయడానికి ఆగస్టు 1వ తేదిని డెడ్ లైనుగా పెట్టారు. ఆ లోపు రాజీనామాలు చేయని వారితో ఎలా చేయించాలో కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. రాజీనామాలు చేసిన వారి వెంట జెఏసి ఉంటుందని చెప్పారు. బుధవారం జెఏసి న్యూఢిల్లీ వెళ్లి వివిధ పార్టీల మద్దతును కూడగడుతుందని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షమైన బిజెపిని కలిసి తమ సకల జనుల సమ్మెకు, పార్లమెంటులో బిల్లు పెట్టడానికి మద్దతు ఇవ్వాలని కోరతామని చెప్పారు. మంగళవారం 130 ఎన్జీవో సంఘాలతో భేటీ అవుతున్నట్టు చెప్పారు.

English summary
Telangana Rastra Samithi mlas resigned second time for Telangana today. They sent their resignations by fax.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X