వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అరవయ్యేళ్లుగా తెలంగాణ ఉద్యమం: అజిత్ సింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ajit Singh
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని తాను అరవై ఏళ్లుగా గమనిస్తున్నానని రాష్ట్రీయ లోకదళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ మంగళవారం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించడానికి ఇదే సరైన సమయం అన్నారు. రాష్ట్రపతి పాలనకు సమయం కాదన్నారు. తెలంగాణ అంశం విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలన్నారు. తెలంగాణ ప్రకటించాలని కోరారు. స్పీకరు నాదెండ్ల మనోహర్ రాజీనామాలు తిరస్కరించే ముందు రాజీనామాలు చేసిన వారిని వ్యక్తిగతంగా ఓసారి కలవాల్సి ఉండెనని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసం తెలంగాణ నేతలంతా ఒక్కటిగా పోరాటం చేయాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని చెప్పారు.

తాజ్ కృష్ణలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాసనసభ్యులు ఆయనను కలిసి తెలంగాణకు మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎర్రబెల్లి దయాకర రావు, కడియం శ్రీహరి కూడా మీడాయాతో మాట్లాడారు. పయ్యావుల కేశవ్ వంటి చీడపురుగులు తమకు సలహాలు ఇవ్వవలసిన అవసరం లేదన్నారు. తెలంగాణ వాదులను కించపరిచేలా సీమాంధ్ర నేతల మాటలు ఉన్నాయన్నారు. కాంగ్రెసు వారిని సంక్షోభం నుండి బయటపడేయడానికే స్పీకరు రాజీనామాలు తిరస్కరించారని అన్నారు.

English summary
RLD chief Ajih Singh said today that he is seeing Telangana agitation from 60 years. He suggested centre that to give seperate Telangana soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X