తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్ర సమావేశంలో టిడిపి, వైయస్సాఆర్ కాంగ్రెసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Payyavula Keshav
తిరుపతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వమని రాష్ట్రం సమైక్యాంగానే ఉంచాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పయ్యావుల కేశవ్ మంగళవారం తిరుపతిలో సమైక్యాంధ్ర రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ నేతలు పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా పయ్యావుల మాట్లాడారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించమని అన్నారు. తెలుగువారంతా కలిసి ఉండాలనేదే తమ అభిమతమన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తొందరపాటులో చేసిన నిర్ణయమని కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రకటించినందున రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతున్నట్టు వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామాలతో తెలంగాణ రాదని అన్నారు. తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలతో పాటు సీమాంధ్రలోని వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీలు కేటాయించాలని వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి కోరారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పలు ప్రతిపాదనలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ప్రాణహిత - చేవెళ్ల, పోలవరం ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలి. రెండు ప్రాంతాల్లో వెనుక బడిన ప్రాంతాలకు అభివృద్ధి మండళ్లు ఏర్పాటు చేయాలి. ట్యాంకుబండుపై కూలగొట్టిన విగ్రహాల స్థానంలో అవే విగ్రహాలను ప్రతిష్టింపజేయాలి. శ్రీకృష్ణ కమిటీ ప్రతిపాదించిన ఆరవ సూత్రాన్ని వెంటనే అమలు పరచాలి. కాగా విశాఖపట్నంలో సమైక్యాంధ్ర జెఏసి పోస్టు కార్డు ఉద్యమానికి నాంది పలికింది. సమైక్యాంధ్రకు అందరూ మద్దతు పలకాలని డిమాండ్ చేస్తూ వారు ప్రతి ఒక్కరికి సోనియా గాంధీ ఇంటి అడ్రసు ఉన్న పోస్టు కార్డులను పంచుతున్నారు.

English summary
YSR Congress, Congress and TDP met today in Samaikyandhra joint action committee's meeting in Tiurpati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X