వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్ప తర్వాత రెడ్డి బ్రదర్స్‌పైనే వేటు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగళూరు: ముఖ్యమంత్రి పదవి నుంచి యడ్యూరప్పను దిగిపోవాలని ఆదేశించిన బిజెపి అధిష్టానం రెడ్డి బ్రదర్స్‌పై కూడా వేటు వేసే అవకాశం ఉంది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో లోకాయుక్త రెడ్డి సోదరులను కూడా తప్పు పట్టింది. పర్యాటక, సాంస్కృతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు, రెవెన్యూ మంత్రి గాలి కరుణాకర్ రెడ్డిని, వారి అనుచరుడు, ఆరోగ్య మంత్రి బి. శ్రీరాములును లోకాయుక్త తప్పు పట్టింది.

పార్టీ కేంద్ర నాయకత్వం నిర్ణయానికి బిజెపి రాష్ట్ర శాఖ కట్టుబడుతుందని శ్రీరాములు చెప్పారు. పదవి నుంచి దిగిపోవాలనే బిజెపి అధిష్టానం ఆదేశమే తుది నిర్ణయమని ఆయన అన్నారు. కర్ణాటకలో తమకు మైనింగ్ లేదని చెప్పినప్పటికీ రెడ్డి సోదరులు బళ్లారిలో ఆ పని చేస్తున్నారని లోకాయుక్త అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెడ్డి బ్రదర్స్ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ఖనిజ తవ్వకాలు జరుపుతోంది. వీరు మంత్రివర్గంలో కొనసాగడం సరైంది కాదని లోకాయుక్త అన్నారు.

English summary

 The BJP central leadership's decision asking Karnataka Chief Minister BS Yeddyurappa to step down has also put a question mark on the continuance of the Bellary brothers in the Cabinet as they have too have been indicted in the Lokayukta report on illegal mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X