వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉద్వాసనే, యడ్యూరప్పకు గాలి బ్రదర్స్ మద్దతు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
బెంగుళూరు: ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సిందేనని యడ్యూరప్పను బిజెపి అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. ఈ స్థితిలో గాలి సోదరులు యడ్యూరప్పకు అండగా నిలుస్తున్నారు. అక్రమ మైనింగ్‌లో లోకాయుక్త సంతోష్ హెగ్డే గాలి సోదరులను కూడా తప్పు పట్టింది. గాలి జనార్దన్ రెడ్డి, గాలి కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు శ్రీరాములు యడ్యూరప్ప మంత్రివర్గంలో ఉన్నారు. గతంలో యడ్యూరప్పను గద్దె దించడానికి ప్రయత్నించిన గాలి సోదరులు ఇప్పుడు ఆయనకు మద్దతు ఇస్తున్నారు. యడ్యూరప్ప తాను గద్దె దిగేది లేదని మొండికేస్తున్నారు. ఢిల్లీ నుంచి గురువారం ఉదయం బెంగళూర్‌కు తిరిగి వచ్చిన ఆయన మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

గాలి సోదరుల మద్దతుతో యడ్యూరప్ప బిజెపి అధినాయకత్వంపై తిరుగుబాటు చేస్తారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మళ్లీ 31వ తేదీన ఢిల్లీకి వెళ్లి అధిష్టానాన్ని ఒప్పిస్తానని యడ్యూరప్ప అంటున్నారు. అధిష్టానం వద్దని ఆదేశించినప్పటికీ యడ్యూరప్ప ఏర్పాటు చేసిన సమావేశానికి పది మంది మంత్రులు, 20 మంది శాసనసభ్యులు హాజరయ్యారు. కాగా, యడ్యూరప్ప స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎంపిక చేయడానికి బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది.

English summary
Powerful Reddy brothers of Bellary, who too have been found guilty in the Hegde report. The Reddy brothers, who are mining barons, had earlier rebelled against Mr Yeddyurappa, but now seem to be standing by him in this common hour of crisis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X