హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్ మాఫియా: సినీతారలను ఎలా పడేస్తారు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Tollywood Stars
హైదరాబాద్: టాలీవుడ్ వ్యక్తులకు మత్తుపదార్థాలను ఎలా సరఫరా చేస్తున్నారనేది, వారితో ఎలా సంబంధాలు ఏర్పరుచుకుంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్నది ఎక్కువ మంది దక్షిణాఫ్రికాకు చెందినవారు కావపడం వల్ల ఆ ఆసక్తి కలుగుతోంది. మత్తుపదార్థాలను అక్రమంగా సరఫరా చేసే వ్యక్తులు ఓ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ సరఫరా చేయడానికి ముందు పనిచేసే ఓ కొరియర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. టాలీవుడ్ ప్రముఖులతో పరిచయాలు పెంచుకుని తమ వ్యాపారాన్ని సాగించడానికి వారు సినీ రంగంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. సినిమాల్లోని క్రౌడ్ సీన్స్‌లో నటించడానికి తక్కువ దరకు అంగీకరించి అందులోకి చొరబడుతున్నారని సమాచారం. కేవలం 2 వేల రూపాయలకు వారు షూటింగులో పాల్గొనడానికి ఒప్పుకుంటున్నారట. అలా లోనికి ప్రవేశించే డ్రగ్ సరఫరాదారులు మెల్లగా నటీనటులతో, ఆర్టిస్టులతో సంభాషణల్లోకి దించి డ్రగ్స్ సరఫరాకు మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు.

మహిళా తారలు చాలా మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు కావడంతో డ్రగ్స్ సరఫరాదారులతో నేరుగా సంపంధాలు పెట్టుకుంటున్నారని కూడా చెబుతున్నారు. గ్రీన్ రూముల్లో, సెలిబ్రిటీల ప్రైవేట్ వ్యాన్లలో, నిర్మానుష్యమైన వీధుల్లో, పబ్‌ల్లో డీల్స్ కుదురుతున్నాయట. పాలిథీన్ కవర్లలో జాగ్రత్తగా దాచి పెట్టి కస్టమర్లకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. డ్రగ్ సరఫరాదారులు ఓ చోట ఓ వ్యక్తి డ్రగ్స్ అందిస్తే, మరో వ్యక్తి మరో చోట డబ్బులు తీసుకుంటాడట. మరో వ్యక్తి పోలీసులపై ఓ కన్నేసి ఉంచుతాడని అంటున్నారు. అలా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెబుతున్నారు.

హైదరాబాదులో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారు ఎక్కువ మంది దక్షిణాఫ్రికా దేశాలకు చెందినవారు కావడం విశేషం. నైజీరియా, ఉగండా, కెన్యా వంటి దేశాలకు చెందినవారు ఎక్కువగా ఉంటున్నారు. ఉన్నత చదువుల కోసం హైదరాబాదుకు వచ్చి డబ్బుల కోసం డ్రగ్స్ సరఫరా వ్యవహారాల్లో చిక్కుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దక్షిణాఫ్రికా దేశాల విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.

English summary
While actors deal with peddlers through their assistant, the female leads of Tollywood thrillers are known to deal with them directly, often because they are not locally connected.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X