వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిరు అల్లుడు శిరీష్ కస్టడీ విచారణ వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Sirish Bharadwaj
హైదరాబాద్‌: మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు శిరీష్‌ భరద్వాజ్‌ కస్టడీ విచారణ గురువారానికి వాయిదా పడింది. వరకట్నపు కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శిరీష్‌ను ప్రశ్నించేందుకు వారం రోజుల పాటు తమ కస్టడికీ అప్పగించాలంటూ హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు శిరీష్‌కు బెయిల్‌ మంజూరు చేయాలంటూ అతడి తరఫు న్యాయవాది బుధవారం కూడా వాదనలు వినిపించారు.

తన భర్త వేధిస్తున్నాడంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఈ ఏడాది మార్చిలో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి శిరీష్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అతను ఇటీవల కోర్టులో లొంగిపోయాడు.

శిరీష్‌భరద్వాజ్‌పై మోపిన అభియోగాలన్నింటికి సరైన సాక్ష్యాలున్నాయని, కేసులో కొన్ని అంశాలను ప్రశ్నించేందుకు అతడు అవసరమైనందున న్యాయస్థానాన్ని అభ్యర్థించామని డీసీపీ(నేరాలు) జె.సత్యనారాయణ తెలిపారు. చంచల్‌గూడ జైల్లో జుడిషియల్‌ కస్టడిలో ఉన్న శిరీష్‌ను అతడి తల్లి సూర్యమంగళ, బంధువు వినోద్‌ కలుసుకున్నారు. ఈ కేసులో సూర్యమంగళకు బెయిల్ లభించింది.

English summary
Mega star Chiranjeevi's son -in- law Sirish Bharadwaj's case hearing adkourned for tommorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X