India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలీసు కస్టడీకి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్

By Pratap
|
Google Oneindia TeluguNews
Sirish Bhardwaj
హైదరాబాద్: వరకట్నం వేధింపుల కేసులో చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ హైదరాబాదులోని నాంపల్లి కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. వరకట్నం వేధింపుల కేసులో శిరీష్ భరద్వాజ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సిఐడి పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. దీనిపై వాదనలు విన్న కోర్టు శిరీష్‌ను పోలీసు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, శిరీష్ భరద్వాజ్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై వాదనలను కోర్టు సోమవారానికి వాయిదా వేసింది.

తన భర్త వేధిస్తున్నాడంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఈ ఏడాది మార్చిలో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి శిరీష్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అతను ఇటీవల కోర్టులో లొంగిపోయాడు.

English summary
Nampally Court in Hyderabad ordered for police custody to Chiranjeevi's son -in-law Sirish Bharadwaj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X