వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగుబాటు, యెడ్డీ వెనక 75 మంది ఎమ్మెల్యేలు

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూర్: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరుగుబాటుతో బిజెపి కేంద్ర నాయకత్వం దిమ్మ తిరిగిపోయింది. యడ్యూరప్పతో ఆయన నివాసంలో పార్టీ కేంద్ర నాయకత్వం పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. యడ్యూరప్పకు 75 మంది శాసనసభ్యులు, 19 మంది పార్లమెంటు సభ్యులు మద్దతు తెలుపుతున్నారు. యడ్యూరప్పను మార్చవద్దని వారు పట్టుబడుతున్నారు. కేంద్ర నాయకత్వానికి వ్యతిరేకంగా యడ్యూరప్ప నివాసం వద్ద నినాదాలు చేశారు. తనకు అంత మంది మద్దతు ఉన్న నేపథ్యంలో తనను మార్చాలనే నిర్ణయంపై పునరాలోచన చేయాలని యడ్యూరప్ప కేంద్ర పరిశీలకులను కోరారు.

ఈ నెల 31వ తేదీన రాజీనామా చేయడానికి అంగీకరించిన యడ్యూరప్ప శుక్రవారం అకస్మాత్తుగా మాట మార్చారు. యు - టర్న్ తీసుకుని కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. అక్రమ మైనింగ్‌లో లోకాయుక్త తప్పు పట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని బిజెపి అగ్ర నాయకత్వం యడ్యూరప్పను ఆదేశించింది. బిజెపి అగ్ర నాయకత్వానికి మరో ఎదురుదెబ్బ కూడా తగిలింది. బిజెపియేతర ప్రభుత్వానికి మద్దతిస్తామని మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. యడ్యూరప్ప బిజెపిపై తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మద్దతిస్తామని ఆయన పరోక్షంగా చెప్పారు. దీంతో బిజెపి అగ్రనాయకత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడింది.

యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిన అవసరం లేదనేది కర్ణాటక పార్టీ పార్లమెంటు సభ్యుల ఏకగ్రీవ అభిప్రాయమని పార్లమెంటు సభ్యుడు డిబి చంద్రగౌడ చెప్పారు. లీకైనందున లోకాయుక్త నివేదిక తన విలువను కోల్పోయిందని ఆయన అన్నారు. యడ్యూరప్ప వ్యక్తి కారని, సిఎంగా ఓ వ్యవస్థ అని, అధిష్టానం తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఆయన అన్నారు. గాలి బ్రదర్స్ కూడా విడిగా కేంద్ర పరిశీలకులను కలిశారు.

English summary
The BJP's crisis in Karnataka seems to have worsened with some party MPs and MLAs coming out in support of sacked chief minister BS Yeddyurappa and asking party high command to reconsider his resignation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X