వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ విద్యార్థి జెఎసి హెచ్చరిక

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana JAC
హైదరాబాద్: తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులకు తెలంగాణ విద్యార్థి సంఘాల జెఎసి హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ ఉద్యోగుల సమ్మెలో సీమాంధ్ర ఉద్యోగులు కూడా పాల్గొనాలని, లేకుంటే దాడులు చేస్తామని జెఎసి నాయకులు హెచ్చరించారు. సమ్మెకు దిగే తమ ప్రాంత ఉద్యోగులకు ఏమైనా జరిగితే సహించేది లేదని, అందుకు ప్రతిగా దాడులు చేస్తామని వారన్నారు. తమ ఉద్యమ కార్యాచరణను రూపొందించడానికి తెలంగాణ విద్యార్థి సంఘాలు సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా పాల్గొన్నారు. సమావేశానంతరం జెఎసి నాయకులు సుమన్, పిడమర్తి రవి తదితరులు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

ఆగస్టు 5 నుంచి 11 వరకు గో టూ కాలేజీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ తేదీల్లో సమ్మెపై విద్యార్థులను చైతన్యపరుస్తామని వారు చెప్పారు ఈ నెల 12వ తేదీ హైదరాబాదులో బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా సైకిల్ ర్యాలీ కూడా నిర్వహిస్తామని వారు తెలిపారు. 13న ఎస్సై పరీక్షలను, 14న జూనియర్ లెక్చరర్స్ పరీక్షను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. ఆగస్టు 16వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ముట్టడి చేపడతామని వారు చెప్పారు. 17వ తేదీ నుంచి సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థలను బహిష్కరిస్తామని వారు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్లీ రాజీనామాలు చేయాలని కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులపై ఒత్తిడి చేయాలని కూడా తెలంగాణ విద్యార్థి సంఘాలు నిర్ణయించుకున్నాయి.

English summary
Telangana students Jac warned Seemandhra staff they will be attacked, if they will not participate in telangana strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X