వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీసా మోసాల ముఠాలతో జాగ్రత్త అంటున్న అమెరికా!

By B N Sharma
|
Google Oneindia TeluguNews

Beware of Visa Fraud rings
మోసపూరిత వీసాలు ఏర్పాటు చేసే ముఠాలతోను, నకిలీ డాక్యుమెంట్లందించే వ్యక్తులతోను భారతీయ విద్యార్ధులు జాగ్రత్త వహించాలని అమెరికా హెచ్చరించింది. వీసాలకు సంబంధించి మరో అమెరికా యూనివర్శిటీపై తాజాగా దాడి చేసిన సందర్భంలో అమెరికా ఈ హెచ్చరికను జారీ చేసింది.

మరో యూనివర్శటీ కూడా ప్రభుత్వ పరిశీలనలో వుంది. విద్యార్ధుల ప్రయోజనాలు కాపాడటమే తమ ధ్యేయమని అమెరికాలో విద్య కొరకై వస్తున్న విద్యార్ధులు మోస పూరిత వీసాలు, నకిలీ పేపర్ల విక్రయదారులకు బలి కాకూడదన్న కారణంగా తాము ఈ ప్రకటన చేస్తున్నట్లు స్టేట్ డిపార్ట్ మెంట్ స్పోక్స్ మన్ మార్క్ టోనర్ తన డైలీ విలేఖరుల సమావేశంలో తెలిపారు.

నార్తరన్ వర్జినీయా యూనివర్శటీ పై ఫెడరల్ అధికార్లు దాడి చేసిన అంశాన్ని అమెరికా పరిశీలిస్తోందని ఆయన అన్నారు. అంశాన్ని పరిశీలిస్తున్నామని భారత ప్రభుత్వంతో సంప్రదిస్తామని కూడా ఆయన తెలిపారు. న్యూఢిల్లీ లోని రాయబార కార్యాలయం విదేశీ వ్యవహారాల శాఖకు వివరించిందని, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోం ల్యాండ్ సెక్యూరిటీ, స్టేట్ డిపార్ట్ మెంట్ లు భారత రాయబార కార్యాలయంతో సంప్రదిస్తూనే వున్నాయన్నారు. దర్యాప్తు సాగుతున్నందున మరిన్ని వివరాలందించలేనని, ప్రతి సంవత్సరం అమెరికా విద్యా సంస్ధలలో లక్షలాది భారతీయులు మంచి విద్యను తీసుకుంటున్నారన్న వాస్తవం గ్రహించాలన్నారు. తాము అమెరికాలో చదవాలన్న భారతీయ విద్యార్ధుల ఆసక్తిని గ్రహించామని కూడా టోనర్ తెలిపారు.

English summary
Embassy in New Delhi has briefed the ministry of external affairs as well and the US Department of Homeland Security and the State Department have been in contact with the Indian Embassy here, he said. "This is an investigation that's ongoing, so I'm limited in what I can give in terms of details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X