వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిగొచ్చిన యడ్యూరప్ప, రేపు ఒంటి గంటకు రాజీనామా

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూరు: కర్ణాటక రాజకీయం మరో మలుపు తిరిగింది. తిరుగుబాటు చేస్తానని శుక్రవారం సంకేతాలు ఇచ్చిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శనివారం ఉదయం దిగొచ్చారు. రేపు ఆదివారం ఒంటి గంటకు రాజీనామా చేస్తానని కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, అరుజైట్లీలకు హామీ ఇచ్చారు. వారితో శనివారం ఉదయం రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రేపు గవర్నర్‌కు రాజీనామా లేఖను సమర్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాను పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించబోనని ఆయన చెప్పారు. అమావాస్య రోజు రాజీనామా చేస్తే కొత్త ముఖ్యమంత్రికి మంచిది కాదని, అందుకే రేపు రాజీనామా చేస్తానని ఆయన అన్నారు.

యడ్యూరప్ప తీరు పట్ల బిజెపి అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం రాత్రి అధిష్టానం పరిశీలకులు అగ్రనేత ఎల్‌కె అద్వానీతో మాట్లాడినట్లు సమాచారం. మాట వినకపోతే యడ్యూరప్పపై సస్పెన్షన్ వేటు వేయాలని ఆయన వారికి సూచించినట్లు తెలుస్తోంది. సస్పెన్షన్ వేటు వల్ల పార్టీ నష్టపోతుందనే ఉద్దేశంతో యడ్యూరప్పను బుజ్జగించే పనిలో పడ్డారు. ఏ విధమైన షరతులు లేకుండానే యడ్యూరప్ప రాజీనామా చేస్తారని బిజెపి రాష్ట్రాధ్యక్షుడు ఈశ్వరప్ప చెప్పారు.

కాగా, యడ్యూరప్ప రాజీనామా కోసం ఎదురు చూస్తున్నామని, యడ్యూరప్ప రాజీనామా తర్వాతనే కొత్త నేత ఎంపిక జరుగుతుందని బిజెపి సీనియర్ నాయకుడు ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. అధిష్టానానికి యడ్యూరప్ప ఎదురుతిరగడం మంచిది కాదని ఆయన అన్నారు. యడ్యూరప్ప రాజీనామా చేయాల్సిందేనని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని ఆయన చెప్పారు.

English summary
After reluctantly accepting his party's order, BS Yeddyurappa had said on Thursday that he will send his resignation to the Governor on July 31. Today, he confirmed that he will not defy party high command and resign by 1 pm tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X