వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రు సంహార యాగం తలపెట్టిన యడ్యూరప్ప

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూరు: దైవ భక్తి ఇతోధికంగా గల కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప శత్రు సంహార యాగం తలపెట్టారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఈ యాగం చేయనున్నారు. ఇందుకు గాను ఆయన పది మంది పూజారులు, ఓ గోమాతను తెప్పించారు. తన నివాసంలో ఆయన ఈ యాగం చేయనున్నారు. అక్రమ మైనింగ్‌పై లోకాయుక్త నివేదిక నేపథ్యంలో తనకు పదవీ గండం ఏర్పడడంతో ఆయన ఈ యాగం చేస్తున్నారు.

కాగా, యడ్యూరప్ప శనివారం ఉదయం బిజెపి కేంద్ర పరిశీలకులు అరుణ్ జైట్లీ, రాజ్‌నాథ్ సింగ్‌లతో దాదాపు 40 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తాను పార్టీ నిర్ణయానికి కట్టుబడి రేపు ఆదివారం రాజీనామా చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం కేంద్ర నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించే దాకా వెళ్లిన యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కొన్ని షరతులు పెడుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రితో పాటు మంత్రి వర్గ సభ్యులు కూడా తాను సూచించినవారే ఉండాలని ఆయన షరతు పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని మంత్రి కట్టా సుబ్రహ్మణ్యం అన్నారు.

English summary
It is said that Karnataka CM Yeddyurappa is made arrangements to perform Shatru Samhara yagam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X