వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రాలయం సంప్రదాయాన్ని ఉల్లంఘించిన జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
కర్నూలు: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సంప్రదాయాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉల్లంఘించారు. శనివారం కర్నూలు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహించిన జగన్ మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. సంప్రదాయం ప్రకారం చొక్కా విప్పేసి భక్తులు రాఘవేంద్ర స్వామిని దర్సించుకోవాల్సి ఉంటుంది. అయితే, చొక్కా విప్పడానికి జగన్ నిరాకరించారు. మఠం అధికారులు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టి ఆయన సాధారణ క్యూలైన్లో వెళ్లి రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. జగన్ భద్రతా సిబ్బంది కూడా బూట్లతో లోనికి ప్రవేశించినట్లు వార్తలు వచ్చాయి.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవించి ఉన్నంత వరకూ నోరుమెదపని వారంతా ఇప్పుడు ఆయనపై అభాండాలు వేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. ఓదార్పుయాత్రలో భాగంగా శనివారం ఆయన కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో పర్యటించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి దయ వల్లే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్నారు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై తమపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో తెలుగుదేశం శాసనసభ్యుడు బాలనాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

English summary
Media reports say that YSR Congress party president YS Jagan voilated Matralayam tradition by entering with shirt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X