వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇన్‌బాక్స్‌ స్పామ్ మెయిల్స్ తొలగించడం ఎలా?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

Mail Inbox
మీ ఇమెయిల్‌ 'ఇన్‌బాక్స్‌' మొత్తం కొత్త మెసేజ్‌లతో నిండిపోతోందా? ఆ మెయిల్స్‌ మీకు తెలిసినవారినుంచి వచ్చినవి కావా? మీరు వాటిని క్లిక్‌ చేస్తే వాటిలో ఉన్న 'సబ్జక్ట్‌ లైన్స్‌' మిమ్మల్ని తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లు గుర్తించారా? వాణిజ్య ప్రకటనలు లేక తప్పుదోవ పట్టించే సమాచారం ద్వారా మీరు ఆ లింకులపై క్లిక్‌ చేస్తే వేరే వెబ్‌సైట్లలోకి ప్రవేశించే విధంగా అవి వున్నాయా? అయితే వాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. అటువంటి సమయంలో ఏం చేయాలి?

స్పామ్‌(SPAM) నుంచి తప్పించుకునే ఉపాయాలు:

మీ ఇమెయిల్‌ అడ్రస్‌ను యథాతథంగా ఇంటర్నెట్‌లో ఉంచకండి. ఒకవేళ మీ ఇమెయిల్‌ అడ్రస్‌ పెట్టవలసిన అవసరం ఏర్పడితే, దాన్ని ముందు వెనకాల చిన్న చిన్న మార్పులతో, లేక అడ్రస్‌నే ముందు వెనుకలుగా మార్చి ఇంటర్నెట్‌లో పెట్టండి. స్పామర్లు గూగుల్‌ వంటి వెబ్‌సెర్చ్‌ ఇంజన్‌లలో ప్రవేశించిన వెంటనే మీ ఇమెయిల్‌ అడ్రస్‌ సులువుగా వారికి కన్పించేలా ఉందేమో గమనించండి. చాలా రకాల ISP ఉచిత ఇమెయిల్‌ అడ్రస్‌లను ఇస్తున్నాయి. అందులో మీరు రెండు ఇమెయిల్‌ అడ్రస్‌లను క్రియేట్‌ చేసుకొని a)ఒకటి స్నేహితులకు, సహ ఉద్యోగులకు, బంధువులకు మెయిల్‌ చేసేందుకు ఉపయోగించవచ్చు. b)రెండవ దాన్ని న్యూస్‌ లెటర్‌లను రాసుకోవడానికి లేక ఫోరమ్స్‌ను పోస్టింగ్‌ చేయడానికి మరియు ఇతర పబ్లిక్‌ లొకేషన్ల కోసం వినియోగించుకోండి.

చాలా ISP ఉచితంగా 'స్పామ్‌' ఫిల్టరింగ్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. వీటిని తప్పక ఉపయోగించండి. అయినా మీకు వచ్చే స్పామ్స్‌ గురించి మీ ISPకి ఫిర్యాదు చేయండి. న్యూస్‌ గ్రూప్‌ పోస్టింగులకు సమాధానాలు రాసేటప్పుడు ఇమెయిల్‌ ఐడీలను దానికి అనుసంధానించి పంపకండి. వెబ్‌ఫామ్‌లను నింపుతున్నపుడు ఆ సైట్‌ ప్రైవసీ పాలసీని తప్పని సరిగా చెక్‌ చేయండి. ఆ సైట్‌ మీ మెయిల్‌ అడ్రస్‌లను ఇతర కంపెనీలకు అమ్మడం కానీ లేక ఇవ్వడం /పంపడం కానీ చేస్తుందేమో పరిశీలించిన తర్వాతనే దాన్ని పూర్తి చేయండి. మీకు వచ్చే స్పామ్‌ మెయిల్స్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిస్పందించకండి. ఒకవేళ మీరు సమాధాన మిచ్చినట్లయితే, మీ మెయిల్‌ ఐడీలను తన మెయిలింగ్‌ లిస్ట్‌ నుంచి తొలగించమని రిక్వెస్ట్‌ చేయండి.

మీ సిస్టమ్‌లోని యాంటీ-వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ అయ్యేలా చూసుకోండి. ఎన్నో వైరస్‌లు, ట్రోజాన్‌లు మీ హార్డ్‌డిస్క్‌ను ఇమెయిల్‌ అడ్రస్‌ల కోసం వెదుకుతూ ఉంటాయి. మీరు మీ సిస్టం యొక్క యాంటి వైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారా మీ సహచరుల ఇమెయిల్‌ అడ్రస్‌లు స్పామ్‌ బారినపడకుండా కాపాడండి. మీ అకౌంట్‌ వివరాలు అందజేస్తే తప్ప గుర్తించనటువంటి మెయిల్‌ అభ్యర్థనలకు ఎట్టి పరిస్థితులలోనూ ప్రతిస్పందించకండి. మీ బ్యాంకు, క్రెడిట్‌ కార్డు కంపెనీ, ఇ-బే, పేపాల్‌ మొదలయిన వాటిలో మీ అకౌంట్‌కు సంబంధించిన అన్ని వివరాలు వారివద్దే ఉంటాయి. వాటిని తిరిగి అడిగే అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అనుకుంటే ప్రత్యక్షంగా కలవడంగానీ, ఫోన్‌ ద్వారా గానీ సంప్రదించాలి. మీ లాగ్‌ ఇన్‌ వివరాలను ఇతరులెవ్వరికీ ఎటువంటి పరిస్థితులలోనూ ఇవ్వకండి.

జిమెయిల్స్ (Gmail) సెట్టింగ్స్‌లోని ఫిల్టర్స్‌ను ఉపయోగించడం ఎలా:

జిమెయిల్‌లోకి లాగిన్‌ అయిన తర్వాత 'సెట్టింగ్స్‌ (Settings)' అనే బటన్‌ ని క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత వచ్చే విండోలో కనిపించే సెట్టింగ్స్‌ మెనూలో నాల్గవ ఆప్షన్‌ 'ఫిల్టర్స్‌'(Filters). ఈ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు వచ్చే స్క్రీన్‌లో కనిపించే Create a new filter అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఇప్పుడు Create a Filter కు సంబంధించిన ఆప్షన్‌తో ఒక స్క్రీన్‌ వస్తుంది. అందులో 'ఫ్రం' (From) అనే బాక్సులో మీరు ఏ మెయిల్‌ ఐడి నుండి వచ్చే మెసేజ్‌లను వాటంతటవే డిలీటయ్యేలా సెట్‌ చెయ్యాలనుకుంటున్నామో ఆ మెయిల్‌ అడ్రస్‌ని టైప్‌ చెయ్యాలి. దీని కిందనే వున్న 'సబ్జెక్ట్‌'(Subject) ఫీల్డ్‌లో ఏదైనా నిర్దిష్టమైన పదం/వాక్యం 'సబ్జెక్ట్‌ లైన్‌'లో వున్న మెయిల్స్‌కి మాత్రమే ఆ ఫిల్టర్‌ అప్లై చెయ్యబడేలా లేదా అటాచ్‌మెంట్లు వున్న మెయిల్స్‌కు మాత్రమే ఫిల్టర్‌ అప్లై అయ్యేలా టైప్‌ చేయాలి. ఇలా మీ అవసరాన్ని బట్టి పలు సెట్టింగులు ఎంచుకోవచ్చు. ఆ తర్వాత Next Step అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.

ఇప్పుడు ''ఆ మెయిల్‌ ఐడి నుండి వచ్చిన మెయిల్‌ మెసేజ్‌లను చూపడంతోపాటు వాటిని ఏం చెయ్యమంటారో తెలపండి'' అంటూ ఓ స్క్రీన్‌ వస్తుంది. అందులో వరుసగా కొన్ని ఆప్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో Delete it ‌ అనే బటన్‌పై టిక్‌ పెట్టి, దాని కిందనే వున్న Create Filter బటన్‌ క్లిక్‌ చేయాలి. ఒకవేళ మనం డిలీట్‌ చేయాలనుకుంటున్న మెయిల్‌ ఐడి నుండి గతంలో వచ్చిన మెసేజ్‌లు ఏమైనా మన 'ఇన్‌బాక్స్‌'లో వుంటే, పనిలోపనిగా వాటిని కూడా డిలీట్‌ చెయ్యాలంటే, పైన చెప్పినట్లుగా బటన్‌పై ప్రెస్‌ చేసే ముందే క్రియేట్‌ ఫిల్టర్‌ పక్కనే వున్న Also apply filter to conversations బటన్‌పై టిక్‌ చెయ్యండి. ఇక్కడ మనం డిలీట్‌ చేయాలనుకున్న మెయిల్‌ ఐడీ నుండి వచ్చిన మెయిల్స్‌ సంఖ్యనుకూడా చూపుతుంది. ఆ తర్వాత Create Filter అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.ఇలా ఫిల్టర్‌ క్రియేట్‌ చేసుకున్న తర్వాత ఇకపై ఆ మెయిల్‌ ఐడి నుండి వచ్చే ప్రతీ మెసేజ్‌ దానంతట అదే డిలీట్‌ చెయ్యబడుతుంది.

English summary
Hello friend these days emails are so easy to send than post a letter to any one it's easy fast reliable and easy to manage but in this most advance age of invention many other thing grow fast like spam, scam and un wanted in our inbox.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X