వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'తెలంగాణం'పై స్పందించిన ప్రధాని, స్పీకర్ నో కామెంట్!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Manmohan Singh
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆదివారం స్పందించారు. స్పీకర్ మీరా కుమార్ అధ్యక్షతన జరిగిన అఖిల పక్ష సమావేశంలో ప్రధాని మాట్లాడారు. తమ పార్టీకి చెందిన పదిమంది పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయడంపై ఆయన స్పందిస్తూ తెలంగాణ సమస్య త్వరలో పరిష్కారం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని త్వరలో తెలంగాణ సమస్యను సైతం ఎదుర్కొంటామని చెప్పారు. అంతకుముందు పార్లమెంటులో తెలంగాణపై చర్చించాలని కోరుతూ ఈ సందర్భంగా భాజపా నేత సుష్మాస్వరాజ్‌ స్పీకర్‌ మీరాకు నోటీసిచ్చారు. కాగా భేటీ అనంతరం బయటకు వచ్చిన మీరాకుమార్‌ ఎంపీల రాజీనామాలపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. టిడిపి ఎంపీ నామా నాగేశ్వర రావు రాజీనామా చేసినందున సమావేశానికి హాజరు కాలేదు.

కాగా సమావేశం అనంతరం మన్మోహన్ సింగ్ మీడియాతో మాట్లాడారు. లోక్‌పాల్ భవితవ్యాన్ని పార్లమెంటే నిర్ణయిస్తుందని ఆయన అన్నారు. పేలవమైన ప్రభుత్వం లోక్‌పాల్ బిల్లుకు వ్యతిరేకంగా ఆగస్టు 16 తేది నుంచి సామాజిక కార్యకర్త అన్నాహజారే తలపెట్టనున్న నిరాహారదీక్షను మీడియా ప్రధాని దృష్టికి తీసుకు వచ్చింది. 2జీ కుంభకోణంపై ప్రతిపక్షాల దాడిని సమర్ధంగా ఎదుర్కోవడాని సిద్ధంగా ఉన్నామని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణ విచారణ కోర్టులో వున్నందున్న తీర్పుపై ముందే ప్రభుత్వం ఓ నిర్ణయానికి రాలేదని అన్నారు.

English summary
Prime Minister Manmohan Singh respond on Telangana issue today after all party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X