వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఉచ్చులో పడాలా?: టి-టిడిపి అయోమయం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉచ్చులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పడుతుందా అంటే అవునని ఆ పార్టీలోనే కొందరు నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అంటూ కెసిఆర్ తమ రాజీనామాలను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునే ఎత్తుగడ వేస్తున్నాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి రాజీనామాలు చేయాలని తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులను హెచ్చరించింది. అంతేకాదు ఆగస్టు 6వ తేది వరకు డెడ్ లైన్ కూడా విధించింది. కెసిఆర్ ఆదేశాల మేరకే జెఏసి కన్వీనర్ కోదండరామ్ పని చేస్తున్నారనేది పలువురి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాజీనామాలు చేయాలని డెడ్ లైన్ పెడుతున్న జెఏసి రాజీనామాలకు అండగా ఉంటామని చెప్పడం మినహా అంతకు మించి హామీలు ఇవ్వడం లేదని టిటిడిపి భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఉప ఎన్నికలు వస్తే తమకే సీటు కేటాయిస్తామనే హామీ జెఏసి నుండి లేదు. దీంతో వారు రాజీనామాలు చేస్తే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి? వాటిని ఎలా ఎదుర్కొనాలి? అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. తాము రాజీనామాలు చేసినప్పటికీ టిఆర్ఎస్ నుండి ఎలాగూ సహకారం ఉండదు. జెఏసి సైతం కెసిఆర్ ఆధ్వర్యంలో పని చేస్తున్నందున అక్కడి నుండి కూడా సహకారం వచ్చే పరిస్థితులు లేవని టిటిడిపి నేతలు భావిస్తున్నారు. అందుకే జెఏసి వ్యూహాత్మకంగా మౌనం వహిస్తుందని అనుమానిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే కనుక టిఆర్ఎస్ తమపై పోటీ కూడా పెట్టవచ్చునని టిటిడిపిలో అనుమానాలు వ్యక్తమవుతున్నట్టుగా తెలుస్తోంది.

అయితే తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన ఈ సమయంలో తాము రాజీనామాలు చేయకుంటే తెలంగాణ ప్రజల దృష్టిలో ద్రోహులుగా మిగులుతామని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. జూలై 4వ తేదిన మిగిలిన పార్టీల కంటే ముందు టిడిపి నేతలే రాజీనామా చేసినందున టిడిపి పట్ల ప్రజల్లో కొంత సానుభూతి కనిపించింది. ఇప్పుడు కూడా అదే తరహా రాజీనామాలు చేస్తే టిఆర్ఎస్, జెఏసి సహకరించినా సహకరించక పోయినా ప్రజలలో విశ్వాసాన్ని చూరగొంటామని కొందరు భావిస్తున్నారు. రాజీనామాలు చేస్తే సానుభూతి కారణంగా టిఆర్ఎస్ వల్ల తమకు జరిగే నష్టం ఉండదని కూడా వారు భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకోసం రాజీనామాలు చేయడమే ఉత్తమమని భావించినట్లుగా కనిపిస్తోంది.

English summary
Some of telugudesam party Telangana leaders are thinking that KCR is trapping them with resignations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X