హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు బెయిల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Sirish Bharadwaj
హైదరాబాద్: వరకట్నం వేధింపుల కేసులో మెగాస్టార్, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్‌కు బెయిల్ మంజూరైంది. హైదరాబాదులోని నాంపల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. లొంగిపోయిన తర్వాత శిరీష్ భరద్వాజ్‌ను తమ కస్టడీకి అప్పగించాలని సిఐడి పోలీసులు కోర్టును కోరారు. ఆ విజ్ఞప్తి మేరకు రెండు రోజుల పాటు ఆయనను నాంపల్లి కోర్టు సిఐడి పోలీసుల కస్టడీకి అప్పగించింది.

తన భర్త వేధిస్తున్నాడంటూ చిరంజీవి కూతురు శ్రీజ ఈ ఏడాది మార్చిలో పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు సీసీఎస్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి శిరీష్‌ అజ్ఞాతంలో ఉన్నాడు. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. అతను ఇటీవల కోర్టులో లొంగిపోయాడు.

English summary
Chiranjeevi's son - in - law Sirish Bharadwaj was granted bail by Nampally court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X