హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పూర్తిగా చెప్పాలంటే రాజీనామా చేయాలి: మంత్రి డిఎల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
హైదరాబాద్: ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి మంగళవారం తన శాఖపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తన శాఖ గురించి చెప్పాలంటే కడుపు చించుకుంటే కాళ్ల మీద పడ్డట్లే అని చెప్పారు. నా శాఖ గురించి పూర్తిగా నిజం చెప్పాల్సి వస్తే పదవికి రాజీనామా చేసి చెప్పాల్సి ఉంటుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. శాఖలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. ఆరోగ్య శాఖ పథకాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లా కనిపిస్తున్నాయన్నారు. కొందరు అధికారులు విధాన నిర్ణయాల్లో తలదూరుస్తున్నారని ఆవేదన చెందారు. ఆరోగ్యశ్రీని ఎత్తివేసే ప్రసక్తి లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య హయాంలో రూ.65 కోట్లు కేటాయిస్తే ఇప్పటి వరకు రాలేదన్నారు. కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ దోపిడీ కూడా నిజమే అన్నారు. వాటిని అదుపు చేయాల్సి ఉందన్నారు.

కాగా వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో కిటుకు చెబితే ప్రజలు కూడా ఎదుగుతారని అన్నారు. జగన్ రాజకీయ ఎదుగుదలను ఎవరూ ఆపాలని అనుకోవడం లేదన్నారు. ఎమ్మార్ అక్రమాలు నాటి ఎపిఐఐసి పాలకవర్గం దృష్టికి రాలేదన్నారు.

English summary
Minister DL Ravindra Reddy is unhappy with his ministry. He said he will resign if to talk about his Ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X