హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రియురాలి ఇంటిముందు ప్రియుడి ఆత్మహత్య యత్నం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: మల్కాజిగిరిలో సౌజన్య అనే యువతి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి ఆ తర్వాత విషం తాగి తాను ఆత్మహత్యకు పడ్డ మురళి అనే యువకుడి సంఘటన జరిగి కొన్ని గంటలకే సికింద్రాబాదులోని పద్మారావు నగర్‌లో మరో ప్రేమికుడు ప్రియురాలి ఇంటి ముందు హంగామా సృష్టించాడు. జగదీష్ అనే యువకుడు పద్మారావు నగర్‌లోని తన ప్రియురాలి ఇంటికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా అడిగాడు. దీనికి ఆమె ససేమీరా అనడంతో అతను ఒంటిపై కిరోసిన్ పోసుకొని అత్మహత్యకు పూనుకున్నాడు. స్థానికులు గమనించి 108కి ఫోన్ చేశారు. జగదీష్‌ని మహాత్మగాంధీ మెమోరియల్ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తున్నారు.

జగదీష్, సదరు యువతి గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారని, పెళ్లి చేసుకోమంటే ఆమె నిరాకరించడంతో నిరాశతో అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడని యువకుడి తరఫు బంధువులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే యువతి తరఫు బంధువులు దానిని కొట్టి పారేస్తున్నారు. జగదీష్‌ది వన్ సైడ్ లవ్ అని, గత కొన్నాళ్లుగా ప్రేమించమని తమ కుమార్తె వెంబడి పడుతున్నాడని ఆమె అంగీకరించడం లేదని చెబుతున్నారు. తమ కూతురు జగదీష్‌ను ప్రేమించలేదని చెప్పారని సమాచారం. కాగా పోలీసులు ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

English summary
A Young boy tried for suicide today in padmarao Nagar of Secunderabad. He sent to MGM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X