హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు మరో నోటీసు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sathya Sai Baba
హైదరాబాద్: తమ తొలి నోటీసుకు ఇచ్చిన సమాధానంపై అసంతప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్య సాయి సెంట్రల్ ట్రస్టుకు మరో నోటీసు జారీ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేపో మాపో ప్రభుత్వం ఈ నోటీసు జారీ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. సత్యసాయి ట్రస్టు లావాదేవీలపై ప్రభుత్వం గత నెలలో వివరాలు అడిగిన విషయం విదితమే. దీనిపై స్పందించిన సెంట్రల్ ట్రస్టు బస్తాలలోఫైళ్లు పంపినా వాటిలో వివరాలు అసమగ్రంగానే ఉన్నాయి.

వాటిని తీసుకున్న ప్రభుత్వం ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) నరసింహమూర్తి ద్వారా పరిశీలన చేయించింది. ప్రభుత్వం అడిగిన విధంగా ట్రస్టు వివరణ లేదని సీఏ వివరించారు. దాతల పేర్లు, వారి చిరునామాలు, దేశ విదేశాల్లో అనుబంధ సంస్థలు ఇతర వివరాలు లేవని పేర్కొన్నారు. అంతేగాక ట్రస్టు అనుబంధ సంస్థలు 154 దేశాల్లో ఉండగా ప్రభుత్వానికి పంపిన ఫైళ్లలో కేవలం పది సంస్థల వివరాలు మాత్రమే పుస్తకాల రూపంలో అందజేశారన్నారు.

లోపాలన్నింటినీ గుర్తించిన సీఏ మూర్తి - కొంత సమాచారమే ఇచ్చారని ప్రభుత్వానికిచ్చిన నివేదికలో వివరించారు. ఈ నివేదికను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి రమణాచారి ముఖ్యమంత్రికి అందజేశారు. నివేదిక పరిశీలించిన సీఎం ఇంతకు ముందు అధికారులు అడిగిన వివరాలన్నింటినీ పూర్తిగా ఇవ్వకపోతే ప్రభుత్వానికి అవసరమైన సమాచారం అడుగుతూ మరో నోటీసు ఇవ్వాలని ఆదేశించారు.

English summary
According to reports - State government nay issue another notice to Sathya Sai Central trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X