వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆజాద్! నాటకాలు వద్దు: కె కేశవరావు గుస్సా

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్‌పై రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు మంగళవారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆజాద్ చర్చల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కాలాయాపన కోసమే ఆయన చర్చలకు తెరతీసినట్లుగా కనిపిస్తోందని ఇదే విషయాన్ని తాము లేఖ ద్వారా తెలియజేశామని చెప్పారు. ఆజాద్ డ్రామాలు చేయవద్దని, చర్చల వల్ల లాభం లేదని చెప్పారు. చర్చల వల్ల ఫలితం లేదని తెలిసినప్పటికీ కేవలం గౌరవంతో మాత్రమే తాము వస్తున్నామని అన్నారు. చర్చలతో ఫలితం ఉండదని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, కోర్ కమిటీ సభ్యలకు లేఖలు రాస్తామని చెప్పారు. తెలంగాణ ఆవశ్యకత, రాజీనామాల అంశంపై ఎందుకు తాము తగ్గటం లేదో ఆ లేఖలో వివరణ ఇస్తామని చెప్పారు. రెండేళ్లకు పైగా తాము తెలంగాణ కోసం ఆందోళన చేస్తున్నా, పార్లమెంటులో ఆందోళన చేసిన సమయంలోనూ అధిష్టానం తమకు సానుకూలంగానే స్పందించిందని అంటే తెలంగాణ ఆందోళన పట్ల వారికి వ్యతిరేకత లేదని అర్థమవుతోందని అన్నారు.

మాట్లాడిందే మాట్లాడటం వల్ల లాభం లేదని తాము సోనియాకు తేల్చి చెబుతామని అన్నారు. 6వ తేదిలోగా రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలని జెఏసి డిమాండ్ చేయడంపై ఆయన మండిపడ్డారు. వాళ్లు తమకు బాసులు కాదన్నారు. వారి చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో విపక్షాలు సంక్లిష్ట అంశాలపై చర్చకు పట్టుబట్టి ఓటింగుకు కోరినప్పుడు పార్లమెంటుకు వెళ్లే అంశాన్ని ఆలోచిస్తామని చెప్పారు. తాము రాజీనామా చేసింది ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే కాని కూల్చడానికి కాదన్నారు. రాజీనామాలు ఆమోదించాలని సభాపతిని కోరారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తమకు వ్యతిరేకత లేదన్నారు. కొన్ని ప్రచార సాధనాలు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి తన కుమారుడితో సమానమని అన్నారు. 14ఎఫ్ పై ముఖ్యమంత్రి గానీ, హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి గానీ ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించారు.

English summary
Rajya Sabha member K Keshav Rao fired at Ghulam Nabi Azad yesterday for talks on Telangana. He said T-Congress leaders will write a letter to AICC president Sonia Gandhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X