హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సత్యం రామలింగరాజుకు ప్రత్యేక కోర్టులో చుక్కెదురు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ramalinga Raju
హైదరాబాద్: సత్యం రామలింగరాజుకు గురువారం సిబిఐ ప్రత్యేక కోర్టులు చుక్కెదురయింది. ఈ నెల ఒకటో తారీఖు సోమవారం నాడు రామలింగ రాజు సిబిఐ ప్రత్యేక కోర్టులో తనకు బెయిలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అయితే రామలింగరాజు బెయిలు పిటిషన్ గురువారం ప్రత్యేక కోర్టులో విచారణకు వచ్చింది. రామలింగరాజు పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. కాగా గతంలో రామలింగరాజు తనకు బెయిలు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బెయిలుకు సుప్రీం కోర్టు నిరాకరించింది.

అయితే 2011 జూలై 31 తేదిలోగా సిబిఐ సత్యం కుంభకోణం విషయంలో దర్యాఫ్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ లోగా విచారణ పూర్తి కాకపోతే రామలింగరాజు, ఆయన సహచరులు బెయిలుకు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించింది. సుప్రీం ఆదేశాల మేరకు జూలై 31 లోగా విచారణ పూర్తి కాక పోవడంతో రామలింగరాజు బెయిలు పిటిషన్ బెట్టుకున్నారు. అయితే సిబిఐ విచారణ పూర్తి కాక పోవడానికి గల కారణాలు చూపించి బెయిలు ఇవ్వకూడదని కోర్టును కోరింది. దీంతో కోర్టు బెయిలు నిరాకరించింది.

English summary
CBI special court reguged Satyam Ramalinga Raju bail petition today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X