హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాదులో భారీగా పేలుడు పదార్థాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలో మరోసారి పోలీసులు భారీ పేలుడు పదార్థాలు గుర్తించారు. సుమారు 870 జిలెటిన్ స్టిక్స్, 1900 వరకు డిటోనేటర్లు గుర్తించారు. వీటిని నార్త్ జోన్ పోలీసులు గురువారం గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్ కలిగి ఉన్న ఏడుగురు నిందితులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. కారు, ఓ ద్విచక్ర వాహనం, రూ.25వేలు సీజ్ చేశారు. పోలీసీలు వారిని విచారిస్తున్నారు. నిందితులు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్నట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల హైదరాబాదు పోలీసులు కంచన్‌బాగ్‌లో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవ సంబరాల దృష్ట్యా ఎలాంటి ప్రమాదం జరగకుండా నగరంలో పోలీసులు పటిష్ట భద్రత చర్యలు చేపట్టారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులు ఈ నెల 20వ తేది వరకు హై అలెర్టు ప్రకటించినట్లుగా తెలుస్తోంది.

English summary
North Zone police found explosives today in Hyderabad. They arrest seven accuses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X